జాతీయ వార్తలు

ఉగ్రవాదులకోసం గాలింపు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోక్రాఝార్ (అస్సాం), ఆగస్టు 6: ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశాన్ని నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) బృందం శనివారం పరిశీలించింది. దాడి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఉగ్రవాద దాడిలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న బోడో వేర్పాటువాద సంస్థ ఎన్‌డిఎఫ్‌బి(ఎస్) మిలిటెంట్ల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అస్సాం రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా దాడి జరిగిన ప్రదేశాన్ని శనివారం సందర్శించారు. శుక్రవారం భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదిని మంజయ్ ఇస్లారిగా గుర్తించినట్లు మంత్రి విలేఖరులకు చెప్పారు. మృతదేహాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దళానికి చెందిన వారు కాదని, ఒకవేళ అయి ఉంటే వారు పారిపోయేవారు కాదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పోలీసు, పారామిలిటరీ, ఆర్మీకి చెందిన బలగాలు పారిపోయిన మిలిటెంట్లను పట్టుకోవడానికి పొరుగున ఉన్న చిరాంగ్ జిల్లాలో విస్తృతంగా గాలిస్తున్నాయి. ప్రత్యేక బలగాలతో పాటు జాగిలాలను రంగంలోకి దించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ప్రత్యేక పరికరాలను కూడా వినియోగిస్తున్నట్లు చెప్పాయి. ఉగ్రవాదులు పారిపోకుండా అస్సాం- బెంగాల్ అంతర్ రాష్ట్ర సరిహద్దులతో పాటు భూటాన్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ గౌహతి వైద్య కళాశాల ఆస్పత్రిని సందర్శించి, తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందజేయాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు ముందు మిలిటెంట్లు తరచుగా హింసకు పాల్పడుతున్నప్పటికీ, ఈ దాడిని నివారించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.