జాతీయ వార్తలు

కోలుకుంటున్న సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: అనారోగ్యంతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. మూడు రోజుల క్రితం ఎడమ భుజానికి ఆపరేషన్ చేసిన తర్వాత శనివారం ఆమె కొంతసేపు నడిచారని, కొన్ని ఎక్సర్‌సైజులు కూడా చేశారని ఇక్కడి సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ముఖ్యమైన వ్యవస్థలన్నీ కూడా మామూలుగా పని చేస్తున్నాయని సోనియా ఆరోగ్య పరిస్థితిపై విడుదల చేసిన బులెటిన్‌లో తెలియజేశారు. సోనియా కోలుకుంటున్న తీరుపట్ల ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆస్పత్రి మేనేజిమెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డిఎస్ రాణా విడుదల చేసిన ఆ బులెటిన్‌లో తెలిపారు.