జాతీయ వార్తలు

వర్గీకరణకే మా మద్దతు స్పష్టం చేసిన దిగ్విజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: పార్లమెంటులో ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఎస్‌సి వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి దిగ్విజయ్ సింగ్ శనివారం వచ్చి తమ సంఘీభావం ప్రకటించారు. దీక్షా కార్యక్రమానికి మాల నాయకులు హాజరుకావటాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశసించారు. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రతిపాదిస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని దిగ్విజయ్ హామీ ఇచ్చారు. ఎస్‌సి వర్గీకరణ కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మూడుసార్లు ఏకగ్రీవ తీర్మానాలు చేశారని ఆయన గుర్తుచేశారు. వర్గీకరణతో మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం కలుగుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వర్గీకరణపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.

చిత్రం..ఢిల్లీలోని ఎమ్మార్పీఎస్ దీక్షా శిబిరలో ప్ర సంగుస్తున్న దిగ్విజయ్ సింగ్