జాతీయ వార్తలు

‘స్వచ్ఛ్భారత్’ ప్రజల ఉద్యమం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రజల ఉద్యమంగా మారాలని ప్రభుత్వ కార్యక్రమంగా దాన్ని చూడకూడదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 500 మున్సిపాలిటీల్లో ఈ ఏడాది నిర్వహించనున్న స్వచ్ఛ్భారత్ సర్వేక్షణ్-2017ను మంత్రి ఆదివారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటయిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘స్వచ్ఛ్భారత్ మిషన్‌ను ప్రభుత్వ కార్యక్రమంగా చూసినంతకాలం అది విజయవంతం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అది ఒక ప్రజా ఉద్యమం కావాలని కూడా ఆయన అన్నారు.
ఈ మిషన్‌లో మరింత ఎక్కువ మంది ప్రజలు పాలుపంచుకోవాలి’ అని అన్నారు. రెండో దఫా నిర్వహిస్తున్న ఈ సర్వే లక్ష జనాభాకు పైబడిన పట్టణాలు, లక్షకన్నా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల రాజధానుల్లో చేపడతారు. అంతేకా ముఖ్యమైన వారసత్వ, పర్యాటక కేంద్రాల్లో కూడా ఈ సర్వే జరుగుతుంది. ఈ దఫా సర్వే జరిగే 500 పట్టణాలు దేశ జనాభాలో 70 శాతానికి ప్రాధాన్యత వహిస్తాయని ఆయన చెప్పారు.
తొలి దఫా సర్వే పది లక్షలకు పైబడిన జనాభా ఉన్న 73 నగరాల్లో నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలను గత జనవరిరలో విడుదల చేశారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పరిస్థితి ఎలా ఉంది, స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రారంభించినప్పటినుంచి ఎంత దూరం ప్రయాణించాం, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత, స్వచ్ఛ పట్టణప్రాంత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం వెళ్లాలి అనే అంశాలను అర్థం చేసుకోవడానికి ఆ సర్వే ఎంతో తోడ్పడిందని వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్యంకోసం అసాధారణ సేవలందించిన వారి వివరాలను తెలియజేస్తూ చత్తీస్‌గఢ్‌లోని దంతారి జిల్లాకు చెందిన 104 ఏళ్ల కున్వర్ బాయ్ అనే వృద్ధురాలు మరుగుదొడ్డికోసం తన మేకలను విక్రయించిందని తెలిపారు. అలాగే మరుగుదొడ్లు లేని కుటుంబాల్లో పెళ్లిచేసుకోవడానికి నిరాకరించిన యువతుల ఉదంతాలను కూడా ఆయన గుర్తు చేశారు.
గత జనవరిలో తొలి సర్వే ఫలితాలను ప్రకటించినప్పటినుంచి దేశంలోని మొత్తం 4,041 నగరాలు, పట్టణాల్లో 115 నగరాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత హోదాను సాధించాయని, మరో 739 నగరాలు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆ స్థాయికి చేరుకోనున్నాయని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించిన విధి విధానాలను విడుదల చేసారు. స్వచ్ఛతా మొబైల్ యాప్‌ను, స్వచ్ఛతా హెల్ప్‌లైన్‌ను కూడా ఆయన ఈ సందర్భంగా విడుదల చేశారు. స్వచ్ఛ్భారత్ మిషన్‌లో ఉత్తమ సేవలందించిన నగర మున్సిపల్ కార్మికులను, వివిధ రాష్ట్రాలకు చెందిన కార్పొరేట్‌లను ఆయన సత్కరించారు. నగరాలకు స్వచ్ఛతా ర్యాంకులను కూడా అందజేశారు. హైదరాబాద్ జిహెచ్‌ఎంసి కార్మికుడు వెంకటయ్య మంత్రి చేతుల మీదుగా ఉత్తర పారిశుద్ధ్య కార్మికుడి అవార్డును అందుకున్నారు.

చిత్రం.. జిహెచ్‌ఎంసి కార్మికుడు వెంకటయ్యకు అవార్డు అందజేస్తున్న వెంకయ్య నాయుడు