జాతీయ వార్తలు

హోదాపై త్వరలో స్పష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందనే ఆశాభావాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నీతి ఆయోగ్ అధ్యక్షుడు పణిగరియా కసరత్తు చేస్తున్నారని చెప్పారు. హోదా అంశంపై ఎన్‌డియే, బిజెపిలను విమర్శించే హక్కు, అధికారం కాంగ్రెస్‌కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. చట్టంలో చేర్చేందుకు ఇష్టపడని కాంగ్రెస్ ఇప్పుడు ప్రత్యేక హోదాకోసం పోరాటం చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని పార్లమెంటులో పట్టుబట్టలేదా అని వెంకయ్య ప్రశ్నించారు. ఒకవైపు వద్దంటూ మరోవైపు ప్రత్యేక హోదాకోసం పోరాడతామనటం అర్థరహితం కాదా? అని అడిగారు. హోదాకోసం ఇప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, రాహుల్ గాంధీ అడుగుతున్నారని, అయితే రాష్ట్రాన్ని విభజించినప్పుడే ప్రత్యేక హోదా ఎందుకు కల్పించలేదని వెంకయ్య నిలదీశారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్‌డియే ప్రభుత్వం గత రెండేళ్లలో పలు ప్రాజెక్టులు, పథకాలను ఏపికి కేటాయించిందని వెంకయ్య నాయుడు చెప్పారు.