జాతీయ వార్తలు

అమెరికా నుంచి జైట్లీ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ శనివారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ‘ఇంటికి చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని శనివారం ఆయన ట్వీట్ చేశారు. జైట్లీ అనారోగ్యం కారణంగా, ఆర్థిక శాఖను తాత్కాలికంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లినప్పటికీ జైట్లీ సోషల్ మీడియాలో చురుగ్గానే ఉన్నారు. గోయల్ లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ఆయన విలేఖరులతో న్యూ యార్క్ నుంచి వీడియో కాల్‌లో సంభాషించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, ఎప్పటికప్పుడు దేశ రాజకీయ, ఆర్థిక అంశాలను విశే్లషిస్తూ, తాను అమెరికాలో ఉన్నానన్న అభిప్రాయం కూడా ఎవరికీ లేకుండా చేశా రు. మధ్యంతర బడ్జెట్ లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు పీటీఐకి ఆయన న్యూయార్క్ నుంచే ఫోన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు అనుమానాలను నివృత్తి చేశారు. కాగా, శనివారం స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన ట్విటర్‌లో తన ఆగమనాన్ని ప్రస్తావించారు. ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. తాను కోలుకుంటున్నానని, బడ్జెట్‌పై ప్రస్తుతం పార్లమెంటులో జరుగుతున్న చర్చలో పాల్గొనేందుకే వచ్చానని తెలిపారు.
అయితే, పార్లమెంటు సమావేశాలకు హాజరవుతానా? లేదా? అన్నది ఇక్కడ తనకు జరిగే వైద్య సేవలపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. సభ్యుల సందేహాలు, ప్రశ్నలకు గోయల్ సమాధానం చెప్తారని జైట్లీ అన్నారు. ఈనెల 13వ తేదీతో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఈలోగా జైట్లీ సమావేశాలకు హాజరుకావడం అనుమానంగానే ఉందన్న వాదన వినిపిస్తున్నది. కానీ, బడ్జెట్ సమావేశాల కోసమే అక్కడి వైద్యులను ఒప్పించి మరీ స్వదేశానికి వచ్చిన జైట్లీ ఇంటికే పరిమితం కారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. మొత్తం మీద జైట్లీ రాకతో, ఆయన ఆరోగ్యం పట్ల ఉన్న ప్రశ్నలకు కొంత వరకైనా సమాధానం లభించిందనే చెప్పాలి.