జాతీయ వార్తలు

వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటానగర్ (అరుణాచల్‌ప్రదేశ్), ఫిబ్రవరి 9: జాతీయస్థాయిలో వౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శనివారం ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశారు. మరో విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుశా దేశంలో ఒకే రోజు ఒక విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన, మరో విమానాశ్రయానికి ప్రారంభోత్సవం జరగడం ఇదేతొలిసారి అన్నారు. కొత్త విమానాశ్రయానికి తేజూ అని నామకరణం చేశారు. రాష్ట్రంలోని మారుమూల ఉన్న లోహిత్ జిల్లాలో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. దీని వల్ల గువహటి, జోర్హాట్, హోలంగి విమానాశ్రయాలతో అనుసంధానం ఏర్పడిందన్నారు. రూ.125 కోట్లతో తేజూ విమానాశ్రయాన్ని నెలకొల్పామన్నారు. దీనివల్ల పర్యాటకం, పరిశ్రమల రంగం అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రస్తుతం ఐటానగర్‌కు 80 కి.మీ దూరంలో అస్సాంలో ఒక విమానశ్రయం ఉంది. వ్యూహాత్మక ప్రదేశాల్లో విమానాశ్రయాలను నెలకొల్పడం వల్ల వరక్త, వాణిజ్య రంగం అభివృద్ధి చెందుతాయన్నారు. 2017లో రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. హోలోంగిలో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు.
చిత్రం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ