జాతీయ వార్తలు

గుప్పిట్లో కాశ్మీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఉత్తరభారత దేశంలో చలిగాలు, మంచు తీవ్రత వణికిస్తోంది. జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. శుక్రవారం రాత్రి వీచిన చలిగాలులకు మంచు గడ్డకట్టుకపోయి జనం అవస్థలు పడ్డారు. కాశ్మీర్ లోయని రహదారులన్నీ మంచుతో నిండిపోయాయి. రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైందని అధికారులు వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో శుక్రవారం రాత్రి 5.7 మైనస్ సెల్సియన్ డిగ్రీలకు పడిపోయింది. అంతకు ముందు రాత్రితో పోల్చుకుంటే ఐదు డిగ్రీలకంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తర కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మైనస్ 14.4 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్‌గావ్‌లో మైనస్ 12.7 సెల్సియస్ డిగ్రీల అత్యల్పంగా రికార్డయింది. ఖాజీగుండ్‌లో మైనస్ 9.0. కుప్వారా, కొకెర్‌నాగ్‌లో కనిష్ట ఉష్ణోత్రలు నమోదయ్యాయి. మైనస్ 7.7,7.7 డిగ్రీల సెల్సియస్ ఉంది. రాత్రి వేళ అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం జరిగింది. కాశ్మీర్‌లోయతోపాటు అనేక ప్రాంతలో రోడ్లు మంచుతో నిండిపోయాయి. వాహనాదారులు ముఖ్యంగా ద్విచక్రాల వాహనాలు కదల్లేని పరిస్థితి నెలకొంది. తెల్లవారిన తరువాత కొద్దిగా సూర్యరక్షి తగిలి చిన్నగా మంచు కరగడం మొదలయ్యాకే బళ్లు కదిలాయి.
ఇలా ఉండగా అత్యంత ప్రధానమైన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని వరుసగా నాలుగోరోజూ మూసివేశారు. రాష్ట్రాన్ని మిగతా ప్రాంతాలకు కలిపే ప్రధాన మార్గం ఇదేనని, వాతావరణం అనుకూలిస్తే రాకపోకలు పునరుద్ధరించాలని భావిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 270 కిలోమీటర్ల రహదారిపై కనీసం 12 చోట్ల మంచు గడ్డకట్టేసింది. రాంబన్, బనిహాల్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని వారన్నారు. యంత్రాల సాయంతో మంచు తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కుల్గావ్ జిల్లాలోని జవహర్ టనె్నల్ వద్ద యుద్ధ ప్రాతిపదికపై పనులు సాగుతున్నాయి.‘ అదనపుసిబ్బందిని రంగంలోకి దించాం. భారీ ఎత్తున యంత్రాలను వాడుతున్నాం. సాధ్యమైనంత త్వరలోనే రహదారిని వినియోగంలోకి తెస్తాం’అని ట్రాఫిక్ ఐజీ అలోక్ కుమార్ వెల్లడించారు. పీడా, షెర్‌బీబీ, డగ్డోలే, మారూగ్, అనోఖీఫాల్, పంతియాల్, నష్రీ, ఖునీనల్హా, గంగ్రాసూలో మంచుపెళ్లు పడి ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎడతెరిపిలేకుండా పడుతున్న వర్షాలకు తోడు మంచు వల్ల పరిస్థితి దారుణంగా మారిందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. కొండల మీద నుంచి బండరాళ్లు కొట్టుకొచ్చి రోడ్లపై పడ్డాయి. భారీ వర్షాలకు మంచు తోడవ్వడంతో బుధవారం నుంచి హైవేపై రాకపోకలు నిలిపివేశారు. దోడా జిల్లాలోని భాదర్‌వాలో ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోయాయి. శుక్రవారం రాత్రి మైనస్ 4.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. జమ్మూ నగరం కూడా గజగజలాడిపోయింది. అంతకు ముందు రాత్రి మైనస్ 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలుండగా శుక్రవారం రాత్రి అమాంతంగా 4కు పడిపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు మామూలుకంటే 5 డిగ్రీలకు కనిష్టంగా ఉంది. తెల్లారాక కాస్త ఎండ రావడంతో ఉపసమనం కలిగింది. బటోటే పట్టణంలో సబ్-జీరో టెంపరేచర్ నమోదైంది. మైనస్ 1.6 డిగ్రీలు నమోదైంది. ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయానికి సంబంధించి కాట్రా బేస్ క్యాంప్ వద్ద 4.8 డిగ్రీల సెల్సియస్ నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇది రియాసీ జిల్లా పరిధిలోకి వస్తుంది.
చిత్రాలు.. శుక్రవారం రాత్రి వీచిన చలిగాలులకు మంచు గడ్డకట్టుకుపోయి కాశ్మీర్ లోయలోని రహదారులన్నీ మంచుతో నిండిపోయిన దృశ్యం.. చిన్నాభిన్నమైన రవాణా వ్యవస్థ.. మంచుతో అవస్థలు పడుతున్న జనం