జాతీయ వార్తలు

గుజ్జర్ల ఆందోళన ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఫిబ్రవరి 9: రాష్ట్రప్రభుత్వ పరిధిలో విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్ల సామాజిక వర్గానికి చెందిన ఆందోళన కారులు చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. స్వాయి మాదోపూర్ జిల్లాలో ఉద్యమంలో భాగంగా గుజ్జర్లు రైలు పట్టాలపై బైఠాయించారు. దీని వల్ల మూడు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఒక రైలును మళ్లించారు. తమ డిమాండ్లను ఆమోదించేంత వరకు ఆందోళనను విరమించే ప్రసక్తిలేదని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ బైన్సియా చెప్పారు. గుజ్జర్లకు మద్దతుగా రైకా రెబారి, గడియా లూహార్, బంజారా, గడారియా తెగలకు చెందిన ప్రజలు ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారు. కోట డివిజన్‌లో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. నిజాముద్దీన్-అహ్మదాబదా, హజరత్ నిజాముద్దీన్-ఉదయ్‌పూర్, ఉదయ్‌పూర్-నిజాముద్దీన్ రైళ్లను రద్దు చేశారు. ఏళ్లతరబడి పోరాటం చేస్తున్నా, తమ డిమాండ్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన చెమప్పారు. 20 రోజులుగా ప్రభుత్వం నుంచి చర్చలకు రావాలని ఆహ్వానం వస్తుందని ఎదురుచూస్తున్నామని బైన్సియా చెప్పారు. రాష్ట్రంలో ఇతర జాతీయ రహదారులపై కూడా గుజ్జర్లు బైఠాయించి నిరసనలను ఉధృతం చేసినట్లు డీజీపీ ఎంఎల్ లాథేర్ చెప్పారు.