జాతీయ వార్తలు

స్వైన్‌ఫ్లూపై హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్వైన్‌ఫ్లూతో గడగడలాడుతున్న గుజరాత్, పంజాబ్‌కు రెండు ప్రత్యేక బృందాలను పంపినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో స్వేన్‌ఫ్లూ విజృంభించింది. వైరస్‌బారిన పడి పలువురు మృతి చెందారు. పరిస్థితి దారుణంగా తయారైంది. గురువారం నాటికి గుజరాత్‌లో 1,187 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 30 మంది చనిపోయారు. అలాగే పంజాబ్‌లో 301 కేసులు నమోదయ్యాయి. ‘హెచ్1ఎన్1 వైరస్‌ను నిర్మూలించడానికి రెండు ప్రత్యేక బృందాలను పంపాం’అని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. మెక్రోబయాలజిస్ట్‌లు, అంటువ్యాధుల నిపుణులు, వైద్యులు బృందాల్లో ఉన్నారు’అని వెల్లడించారు. ఇంతకు ముందు రాజస్థాన్‌లోనూ స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకావడంతో కేంద్రం నిపుణుల బృందాన్ని అక్కడకు పంపింది. ఈనెల 7 వరకూ రాజస్థాన్‌లో 96 మంది హెచ్1ఎన్1 సోకి మృతి చెందారు. 2,706 కేసులు నమోదయ్యాయి. వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆరువేలకు పైగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. హెచ్1ఎన్1 వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితులను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. వ్యాధి నిరోధక టీకాలు సరఫరా చేయాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్‌ను ఆదేశించారు. వైరస్ మరింత విస్తరించకుండా రాష్ట్రాలను అప్రమత్తం చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. 13 రాష్ట్రాల్లో హెచ్1ఎన్ వైరస్ వ్యాపించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్‌లోనే మరణాలు ఎక్కువ సంభవించాయి. డియాబెటిక్, హైపర్ టెన్షన్ ఉన్న వారే ఎక్కువగా చనిపోతున్నట్టు నిర్ధారించారు. పరిస్థితిని చక్కదిద్దడానికి వీడియో కాన్ఫరెన్స్‌లు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.