జాతీయ వార్తలు

కుట్ర వెనక బీజేపీ పెద్దలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్ర వెనక బీజేపీ జాతీయ నాయకులున్నారని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్‌ను అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప జేడీఎస్ ఎమ్మెల్యేతో బేరసాలకు సంబంధించి ఆడియో టేప్ బయటపడంతో కలకలం రేపింది. జేడీఎస్ ఎమ్మెల్యేకు యెడ్యూరప్ప పది కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు ఆడియో టేప్పుల్లో వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ‘కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా దీనివెనక ఉన్నారు’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.‘ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచానికి కేంద్రం ప్రయత్నిస్తోంది’అని విమర్శించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేదికా యోడ్యూరప్ప ఆడియోలో ఉందని వేణుగోపాల్ వెల్లడించారు. ‘అమిత్‌షా న్యాయమూర్తులను మేనేజ్ చేస్తారు.. అంటూ యెడ్యూరప్ప తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు’అని ఆయన తెలిపారు. దీనిపై సీజే జోక్యం చేసుకుని దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందన్న సుర్జేవాలా సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 13తో ముగియనున్న సంగతి తెలిసిందే. యెడ్యూరప్ప ఆడియోటేప్‌ను ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం బయటపెట్టారు. 20 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి 450 కోట్ల రూపాయలైనా వెనకాడవద్దంటూ టేపుల్లో ఉంది. ఈ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి? పీఎంవోనా లేక బీజేపీ హైకమాండ్ సమకూర్చిందా? అని సుర్జేవాలా ప్రశ్నించారు. అవినీతి నిరోధక చట్టం కింద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ లేదా ఈడీకి యెడ్యూరప్పపై దాడి చేసే ధైర్యం ఉందా? అని అడిగారు. అసలు సూత్రధారులెవరో తేల్చాలన్న కాంగ్రెస్ నేతలు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని వెల్లడించారు.