జాతీయ వార్తలు

విగ్రహాల ఖర్చు చెల్లింపుపై రాద్ధాంతం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 9: తన విగ్రహాల స్థాపనకు పెట్టిన ఖర్చును తిరిగి చెల్లించవచ్చని బీఎస్పీ అధినేత్రి మాయావతికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంపై బీజేపీ రాద్ధాంతం చేయడం తగదని బీఎస్పీ కోరింది. ఈ కేసులో తుది తీర్పు ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించనుంది. కోర్టు చేసిన సూచనను గోరంతలు,కొండంతలు చేసి ప్రచారం చేయరాదని మాయావతి మీడియాను కోరారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. దళితులు, ఓబీసీ జాతుల్లో జన్మించిన గొప్ప నేతలకు విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు పర్యాటక కేంద్రాలుగా తయారయ్యాయన్నారు. ఇదే విషయాన్ని కోర్టు ముందు ఉంచుతామన్నారు. గత శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని తన విగ్రహాల ఏర్పాటుకు పెట్టిన ఖర్చును మాయావతి చెల్లింవచ్చని వ్యాఖ్యలు చేసింది. 2009లో ఒక న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన విగ్రహంతో పాటు, పార్టీ గుర్తు ఏనుగుకు సంబంధించి విగ్రహాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టారని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. కాగా ఈ విషయమై ఎస్పీ అధినేత అఖిలేష్‌యాదవ్ మాట్లాడుతూ, తన వద్ద ఈ విషయమై పూర్తి సమాచారం లేదన్నారు. ఈ విషయమై తాను మాట్లాడనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ పార్టీలు పొత్తుపెట్టుకుని కలిసి పోటీ చేయనున్న విషయం విదితమే.