జాతీయ వార్తలు

పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా హక్కులకు భంగం కలగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంగ్సరీ (అస్సాం): త్వరలో కేంద్రం పార్లమెంటు ద్వారా తేనున్న పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. శనివారం ఇక్కడ జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎటువంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ద్వారా స్థానిక ప్రజల హక్కులకు భంగం కలగదన్నారు. దీనిపై అపోహలను నమ్మవదన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తోందన్నారు. దేశంలో సరిహద్దుల ద్వారా చొరబడిన వారికి, మాతృదేశంలో నిరాశ్రయులై ఇక్కడకు వచ్చిన వారికి మధ్య తేడా ఉందని ఆయన చెప్పారు. తమ మత విశ్వాసాలను పాటించకుండా ఇరుగుపొరుగు దేశాలు కొన్ని వర్గాల ప్రజలను హింసించాయన్నారు. అక్కడ వత్తిడిని తట్టుకోలేక ఇక్కడకు వచ్చిన వారికి మాత్రమే పౌరసత్వం కల్పిస్తామన్నారు. అక్రమంగా చొరబడి తిష్టవేసిన వారికి పౌరసత్వం బిల్లు వర్తించదన్నారు. 36 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అస్సాం ఒప్పందాన్నిఅమలు చేస్తామన్నారు. స్థానిక ప్రజల భాష, సంస్కృతి, వారి సంప్రదాయాలు, ఆకాంక్షలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని వర్గాలప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం రాజీలేకుండా అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. ఈ విషయంలో కొన్ని పార్టీలు చేస్తున్న రాద్ధాంతాన్ని నమ్మవదన్నారు. గత నాలుగేళ్లలో అస్సాంలో రూ.14వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
చిత్రం.. కాంరప్‌లో శనివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ