జాతీయ వార్తలు

ప్యాకేజీకి ఒప్పుకుని ప్లేటు మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించిన ముఖ్యమత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు కోరిన విధంగా ప్యాకేజీలో మార్పులు, చేర్పులు కూడా చేశామని గోయల్ వెల్లడించారు. వైపాకా సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు గోయల్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘ఏపీకి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా 2016 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని చంద్రబాబు స్వాగతించారు. తదుపరి ప్యాకేజీకి మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించగా మార్పులు చేపట్టాం. 2017లో సవరించిన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం కూడా తె లిపింది’అని మంత్రి వెల్లడించారు. తాము సూచించిన మార్పులతో ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు 2017 మే 2న కేంద్ర ఆర్థి క శాఖ మంత్రికి ఒక లేఖ కూడా రాశారని గోయ ల్ గుర్తుచేశారు. ‘కేంద్ర ప్రాయోజిత పథకాలతోపాటు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇస్తున్న మాదిరిగానే విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేప ట్టే ప్రాజెక్టులకు సైతం కేంద్రం వాటాగా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10శాతం కింద ప్రత్యేక సహా యం చేయాలి’అని అడిగారని మంత్రి పేర్కొన్నా రు. అలాగే ఇతర ఈఏపీలు, చిన్న మొత్తాల పొదు పు, నాబార్డు నుండి అప్పటికే పొందిన రుణాల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలి, దేశీయ ఆర్థిక సంస్థలైన నాబార్డ్, హడ్కో ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునేందుకు అనుమతించాలి, కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్, విదేశీ ఆర్థిక సంస్థల నుండి పొందిన అప్పులపై వడ్డీ చెల్లించేందుకు విరామం పొందే వీలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం కోరిందని గోయల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రత్యేక ఆర్థిక సాయం చర్యలను రాష్ట్రం ఎఫ్‌ర్‌బీఎం పరిధిలోకి చేర్చాలన్నవి చంద్రబాబు నాయుడు కోరిన ఐదు మార్పులని మంత్రి చెప్పారు. చంద్రబాబు అడిగినవాటిని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని పియూష్ గోయల్ తన లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఐదు అంశాలతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి మార్పులు చేసిన అనంతరం 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందన్నారు. ప్రకటించిన ప్యాకేజీ ప్రకారమే ఏపీకి కేంద్ర ప్రయోజిత పథకాలకు 90:10 నిష్పత్తిలో నిధుల విడుదలతో పాటు ఈఏపీ ఇతర ఆర్థిక సంస్థల నుంచి పొందిన రుణాలకు వడ్డీ చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని మంత్రి ప్రకటించారు.
రాష్ట్రాలదే నిర్ణయం
మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లలో రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేయాలనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మరోప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో 2018 నుంచి ఇంత వరకు స్వైన్ ఫ్లూ బారిన పడిన వారిలో 21 మంది మరణించినట్లు చౌబే చెప్పారు. మొత్తం 402 మందికి ఈ వ్యాధి సోకిందన్నారు.