జాతీయ వార్తలు

దెబ్బకు దెబ్బ తీస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఫిబ్రవరి 18: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే సత్తా ఒక్క ప్రధాని నరేంద్రమోదీకే ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రపంచంలోని ఏ రాజకీయ నాయకుడికి అంత సమర్థత లేదని సోమవారం ఇక్కడ చెప్పారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం అమరజావన్ల త్యాగాలను వృధాగా పోనీయదని, దెబ్బకుదెబ్బ తీస్తుందని షా హెచ్చరించారు. జైపూర్‌లోని సూరజ్ మైదాన్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండించారు.‘శతృదేశానికి తగిన బుద్ధి చెప్పడానికి మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛను కేంద్రం ఇస్తుంది’అని అన్నారు. మోదీలాంటి ప్రధాని, సమర్థవంతమైన ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఉగ్రవాదం పీచమణవచ్చు అని బీజేపీ అధ్యక్షుడు చెప్పారు. ‘మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. బడ్జెట్‌లో రక్షణ శాఖకు ఇతోధికంగా నిధులు కేటాయించింది. స్వాతంత్య్రం వచ్చాక అంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదు’అని షా స్పష్టం చేశారు.రాజస్థాన్ నుంచి లోక్‌సభ ప్రచారానికి శ్రీకారం చుట్టిన అమిత్‌షా రక్షణ రంగాన్ని బలోపేతం చేయానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. పుల్వామాలో ఉగ్రవాదులు మారణకాండను యావత్ జాతి ఖండిస్తోందని ఆయన అన్నారు. ‘అమర జవాన్ల త్యాగాలను మోదీ ప్రభుత్వం వృధా చేయదు. శతృదేశానికి మన ఆర్మీ గట్టిగానే బుద్ధు చెబుతుంది’అని ఆయన ప్రకటించారు. ‘్భరత్‌ను ఉగ్రవాద రహిత దేశంగా మార్చడానికి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారు. ప్రపంచంలోని మరేనాయకుడు ఇంత కఠినంగా వ్యవహరించడం లేదు’అని ఆయన అన్నారు. కేంద్రంలో మోదీలాంటి నేత నాయకత్వంలో, బలమైన ప్రభుత్వం ఉంటే నే సమర్థవంతమైన పాలన ప్రజలకు అందుతుందని కార్యకర్తలతో చెప్పారు. మోదీలాంటి బలమైన నాయకుడు ప్రతిపక్షాలకు లేడని షా అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలోని మహాకూటమికి దశ దిశలేదని, మోదీ హటావో నినాదం ఒక్కటే పట్టుకుని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.
చిత్రం.. జైపూర్‌లోని సూరజ్ మైదాన్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా