జాతీయ వార్తలు

ఆధారాలున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పుల్వానా ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నదని చెప్పేందుకు బలమైన ఆధారాలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని పాక్‌కు తెలియచేసినట్లు కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ చెప్పారు. ఈ ఘటనలో పాక్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు చూపిస్తే, తమ దేశంలో ఉన్నబాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయమై కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ మాట్లాడుతూ, ఇప్పటికే అవసరమైన బలమైన ఆధారాలను మన మిలిటరీ ఇంటెలిజెన్స్ సేకరించిందని చెప్పారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు తెలియచేశామన్నారు. ప్రస్తుతం మన మిలిటరీకి పూర్తి స్వేచ్చ ఇచ్చామని, ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు అవసరమై అన్ని కఠిన చర్యలు తీఃసుకుంటామన్నారు. ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు పట్టించుకోవాల్సిన పనిలేదని, భారత్‌కు ఏ సమయంలో ఏమి చేయాలో తెలుసన్నారు. భారత్ ఒక జవాబుదారీతనం ఉన్న దేశమన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాలను పాకిస్తాన్ మానుకోవాలన్నారు. చర్చలంటూ జరిగితే ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయమై ఉండాలని తన అభిప్రాయమన్నారు. ముంబయి దాడులకు సంబంధించి సూత్రధారులు యథేచ్ఛగా పాకిస్తాన్‌లో తిరుగుతున్నారన్నారు. వీరిపై ఇంతవరకు చర్యలేవీ అని ఆయన నిలదీశారు.

చిత్రం.. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్