జాతీయ వార్తలు

విద్యార్థినికి రేప్ బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 20: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన పాపానికి ఓ విద్యార్థినికి ఫేస్‌బుక్‌లో నరకం చూపిస్తున్నారు. ఈనెల 15న పుల్వామాలో జైషే ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఉగ్రవాదులు దుశ్చర్యలు 12వ తరగతి విద్యార్థినిని తీవ్రంగా కలచివేసింది. మారణకాండను ఖండిస్తూ, ఇలాంటి సంఘటనల వల్ల కశ్మీరీలు కష్టాలు పడుతున్నారని ఆమె పోస్టు చేసింది. ఆమె పోస్టుతో పలు ఛాందసవాదులు రెచ్చిపోయారు. భారత్ వదలి పాకిస్తాన్ వెళ్లిపోమ్మని కొందరు, కనిపిస్తే రేప్ చేస్తామని మరికొందరు బెదిరింపులకు దిగారు. కొందరైతే ఫేస్‌బుక్ ఆధారంగా ఆమె సమాచారం, ఉండే ప్రాంతం కోసం ఆరా తీసినట్టు తెలిసింది.‘ముందుగా నాకు అనేక బెదిరింపులు వచ్చాయి. దీంతో నేను చేసిన పోస్టు తొలగించాను. అయితే కొందరు యువకులు నాకోసం వెదుకుతున్నట్టు తెలిసి నా ఫేస్‌బుక్ ఖాతానే డిలిట్ చేశా’అని ఆమె వెల్లడించింది. బెదిరింపులకు భయపడి గత రెండు రోజులుగా స్కూలుకు వెళ్లడమే మానేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భయాందోళనకు గురైన ఆమె బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి భద్రత కల్పిస్తామన్న పోలీసులు కేసును సైబర్ క్రైమ్ డివిజన్‌కు బదిలీ చేశారు. పుల్వామా ఉగ్రదాడి తరువాత బడిలోనూ, ఇరుపొగురువారి నుంచి తమ కుమార్తెలు వివక్షను ఎదుర్కొంటున్నట్టు స్థానికంగా ఉండే ఓ కాశ్మీరీ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నగరం విడిచి వెళ్లిపోవాలని తాము నిర్ణయించుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఇది జరిగిన రెండు రోజులకే మరో విద్యార్థిని ఉదంతం వెలుగుచూసింది.