జాతీయ వార్తలు

కాశ్మీరీ విద్యార్థులపై దాడులు జరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో కాశ్మీర్ లోయలోని కాశ్మీరీ విద్యార్థులపై ఎలాంటి దాడులు జరగలేదని, వారు నిశ్చితంగా ఉండవచ్చునని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ స్పష్టం చేశారు. పుల్వామా సంఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారని, ఈ దాడి నేపథ్యంలో కాశ్మీర్ విద్యార్థులకు ఎలాంటి భయం అవసరం లేదని తెలిపారు. ఉగ్రదాడిపై దేశప్రజలంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారని, అలాగని కాశ్మీర్ విద్యార్థులపై ఎలాంటి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే వివిధ నగరాల నుంచి వచ్చిన కాశ్మీరి విద్యార్థులు కొందరు ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంపై వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయన్నారు. అలాంటి విద్యార్థులను తాము చేర్చుకోమని డెహ్రాడూన్‌లోని కాలేజీలు ఇప్పటికే స్పష్టం చేశాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కాశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థులు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయకుండా తమతమ ప్రదేశాల్లోనే ఉండాలని కాశ్మీర్ ప్రభుత్వం సూచించింది.
అలాగే దేశంలోని వివిధ చోట్ల చదువుతున్న కాశ్మీర్ విద్యార్థులకు భద్రత కల్పించాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదుల దాడి అనంతరం కాశ్మీర్ విద్యార్థులు, ప్రజలపై ఎలాంటి దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.