జాతీయ వార్తలు

మీకు ఏ హక్కూ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కాశ్మీర్ విషయంలో పాక్ వ్యవహరిస్తున్న తీరును భారత్ మరోసారి తీవ్రంగా తప్పుబడుతూ, ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు పాక్‌కు ఎంతమాత్రం లేదని స్పష్టం చేసింది. కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించినంతమాత్రాన భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడడం, చొరబాట్లను ప్రోత్సహిస్తున్న దాని పాపం తుడిచిపెట్టుకుపోదని కూడా స్పష్టం చేసింది. ‘కాశ్మీర్ సమస్య భారత్ అంతర్గత వ్యవహారం. అన్ని రకాల సీమాంతర ఉగ్రవాద చర్యలను, హింసను రెచ్చగొట్టే చర్యలకు స్వస్తి చెప్పడం తప్ప కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకునే హక్కు పాక్‌కు ఎంతమాత్రం లేదు’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం స్పష్టం చేశారు. జమ్మూ, కాశ్మీర్‌లో మానవ కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు ముగింపు పలకాలని, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను అమలు చేయాలని కోరుతూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐరాస ప్రధాన కార్యదర్శికి, ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌కు లేఖలు రాయడం గురించి విలేఖరుల ప్రశ్నలకు సమాధానంగా వికాస్ స్వరూప్ ఈ విషయం తెలియజేశారు. కాశ్మీర్‌లో భద్రతా దళాలు అత్యంత సంయమనంతో వ్యవహరిస్తున్నాయని, ఇటీవల అలర్లర్ల 3780 మంది భద్రతా జవాన్లు గాయపడ్డమే దీనికి నిదర్శనమని రాజ్యసభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ తెలియజేశారు.