జాతీయ వార్తలు

ఏం మాట్లాడాలో చెప్పండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న ఎర్రకోట బురుజుపై నుంచి తాను చేసే ప్రసంగానికి సలహాలు ఇవ్వవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి సలహాలు ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో సందేశాలను ఉంచారు. ప్రధాని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసానికి నేరుగా ప్రజలనుంచి సలహాలు, సూచనలు, ఆలోచనలను అడగడం ద్వారా ఒక కొత్త ధోరణికి అంకురార్పణ చేశారు. నిరుటిలాగే ఈ సంవత్సరం కూడా ప్రజల ఆలోచనలను, సలహాలను, సూచనలను ప్రధాని ఆహ్వానిస్తున్నారని ఈ వెబ్‌సైట్లలో పేర్కొన్నారు. మైగౌవ్ ఓపెన్ ఫోరం లేదా నరేంద్ర మోదీ సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజలు తమ సలహాలు, ఆలోచనలను తెలియజేయవచ్చని పేర్కొంది. ‘సంబంధిత ఐకాన్‌పై క్లిక్ చేసి, ప్రజలు తమ ఆలోచనలను, సూచనలను ఇవ్వవలసి ఉంటుంది. వీటిలో ఉత్తమమైన వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా స్వీకరించి, తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చేర్చుకుంటారు’ అని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్‌సైట్ తెలిపింది. నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ఎర్రకోటపై నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు.