జాతీయ వార్తలు

జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 5 ప్రయోగం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 11: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల 29న ప్రయోగించాల్సిన జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 5 రాకెట్ ప్రయోగం వాయిదా పడినట్లు తెలిసింది. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఇన్‌శాట్- 3డిఆర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఐదు రోజుల క్రితం ఈ నెల 6న ఉపగ్రహం బెంగళూరు నుండి షార్‌కు చేరింది. దీనిని ఉపగ్రహ శుభ్రత గదిలో పెట్టి శాస్తవ్రేత్తలు పలు రకాలు పరీక్షలు నిర్వహించారు. ఉపగ్రహాన్ని పరీక్షించే సమయంలో స్వల్ప లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని 10రోజులు వాయిదా వేసినట్లు ఇస్రో వర్గాల నుండి సమాచారం. ఉపగ్రహంలో తలెత్తిన చిన్న లోపాన్ని సరిచేసేందుకు 10రోజులు సమయం పడుతున్న నేపధ్యంలో వాయిదా పడినట్లు సమాచారం. సెప్టెంబరు రెండో వారంలో జిఎస్‌ఎల్‌విని ప్రయోగించేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.