జాతీయ వార్తలు

బోయింగ్ 737 మాక్స్ విమానాలపై ఆంక్షలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ఇథియోపియాలో ఆదివారం జరిగిన బోయింగ్ 737 మాక్స్ విమాన ఘోర విమాన ప్రమాదం తో భారత్ అప్రమత్తమైంది. ఈ విమానం కూలిన ప్రమాదంలో 157 మంది మృతి చెందగా, అందులో నలుగురు భారతీయులు సైతం ఉన్న విషయం తెలిసిందే. ప్రయాణికుల అవసరాలకు ఎక్కువగా వినియోగిస్తున్న 737 మాక్స్ బోయింగ్ విమానాల్లో అదనపు భద్రతా ప్రమాణాలను పాటించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నట్టు పౌర విమానయాన సంస్థ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు సోమవారం మాట్లాడుతూ ప్రస్తుతం భారత్‌లో నడుస్తున్న ఈ విమానాలకు సంబంధించి చేపట్టాల్సిన అదనపు భద్రతా ఏర్పాట్లపై డీజీసీఏ అధికారులతో పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ చర్చలు జరిపిందని చెప్పారు.
గత ఐదునెలల కాల వ్యవధిలో బోయింగ్ 737 మాక్స్ విమానాలు రెండు కూలిపోవడం సంచలనం కలిగిస్తోంది. వీటి నాణ్యత, భద్రతా ప్రమాణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటి వినియోగంపై భారత్, చైనా లాంటి దేశాలు దృష్టి సారించాయి. లియోన్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే 737 మాక్స్ 8 విమానం గత ఏడాది అక్టోబర్ 2018న ఇండోనేషియాలో కుప్పకూలిన ప్రమాదంలో 180 మంది మృతి చెందగా, తాజాగా ఇథియోపియాలో ఇదే రకం విమానం కుప్పకూలి 157 మంది దుర్మరణం చెందారు. ప్రయాణికులను తీసుకువెళ్లే విమానాలుగా పేరుపొందిన బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్‌లోని జెట్ ఎయిర్‌వేస్ ఇప్పటికే 737 మాక్స్ విమానాలు 225 కావాలని ఆర్డర్ ఇవ్వగా, కొన్నింటిని ఇప్పటికే అందజేశారు. అలాగే స్పైస్ జెట్ సంస్థ విస్తరణలో భాగంగా 205 కొత్త విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకోగా, అందులో 737 మాక్స్ 8 విమానాలే 155 వరకు ఉన్నాయి.