జాతీయ వార్తలు

లౌకిక శక్తులు ఏకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, మార్చి 12: నియంతృత్వ, దురంహంకార, ద్వేషపూరిత సిద్ధాంతాలను వ్యాపింపచేస్తున్న బీజేపీ, ఆరెస్సెస్‌లను ఓడించేందుకు లౌకిక శక్తులు ఏకతాటిపైకి రావాలని ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లడుతూ దేశాన్ని విభజించే మతతత్వ శక్తులను చిత్తుగా ఓడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన దండి ఉప్పు సత్యాగ్రహం యాత్ర దినోత్సవం రోజున ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక భవన్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగడం విశేషమని అన్నారు. సమాజంలో వేర్పాటు వాదాన్ని బీజేపీ ప్రోత్సహిస్తోందని, ఈ శక్తులను మట్టికరిపించేందుకు త్యాగాల అవసరం లేదని అన్నారు. కేవలం ఎన్నికల్లో ఈ శక్తులను ఓడిస్తే సరిపోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించి ఖరారు చేశారు. తొలుత సబర్మతి ఆశ్రమంలో గాంధీ చిత్రపటానికి రాహుల్, సోనియా, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 1930 మార్చి 1న సబర్మతి ఆశ్రమం నుంచి మహాత్మాగాంధీ దండియాత్రను ప్రారంభించారు. ఈ సమావేశానికి ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తొలిసారిగా హాజరు కావడం విశేషం. వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ సీట్లకు పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే తుది బాధ్యతను రాహుల్ గాంధీకి అప్పగిస్తూ సమావేశం తీర్మానం చేయనుంది. ఉగ్రవాద దాడులను ఖండించడమేకాకుండా, దేశ భద్రతలో ప్రభుత్వం రాజీపడరాదని తీర్మానించననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో అణచివేయాలని పార్టీ కోరనుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాలపై వర్కింగ్ కమిటీ సభ్యులు చర్చించారు. గుజరాత్‌లో వర్కింగ్ కమిటీ సమావేశం జరిగి 58 ఏళ్లయింది. చివరిసారిగా 1961లో గుజరాత్‌లో వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలు, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనలో వైఫల్యం, జాతీయ భద్రత, మహిళల భద్రత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలకు ప్రజలు బలైపోతున్నారని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. జాతి ప్రయోజనాలను తాకట్టుపెట్టే విధంగా మోదీ విధానాలున్నాయని విమర్శించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం తీవ్రంగా ఉందని అన్నారు.
చిత్రం.. అహ్మదాబాద్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో తల్లి సోనియాతో ముచ్చటిస్తున్న రాహుల్