జాతీయ వార్తలు

మెరుగైన నాయకత్వానికి ఇదే సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మార్చి 14: గత చాలా రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు శతృఘ్న సిన్హా గురువారం మరోసారి మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక కొత్త, మెరుగైన నాయకత్వం బాధ్యతలు స్వీకరించడానికి ఇదే మంచి సమయమని ఆయన పేర్కొన్నారు. పాట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయిన శతృఘ్న సిన్హా బీజేపీ నుంచి బయటకు రావడానికి సమయం ఆసన్నమయిన వేళ ఆయన మరోసారి గురువారం సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా మోదీపై సునిశిత విమర్శలకు దిగారు. శతృఘ్న సిన్హా వచ్చే వారం ప్రతిపక్ష మహాకూటమిలో చేరుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అయిదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా విలేఖరుల సమావేశం (ప్రెస్ కాన్ఫరెన్స్)లో పాల్గొనని ఏకైక నాయకుడు నరేంద్ర మోదీయేనని శతృఘ్న సిన్హా విమర్శించారు. ‘లోక్‌సభ ఎన్నికలు ప్రకటించారు. సర్, ఇప్పుడయినా కనీసం ఒక్కసారి విలేఖరుల సమావేశంలో పాల్గొనండి. ప్రజాస్వామ్య ప్రపంచంలో మొత్తం పదవీకాలంలో ఒక్కసారి కూడా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సెషన్‌లో పాల్గొనని ప్రధానమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోబోతున్నారు’ అని శతృఘ్న సిన్హా గురువారం మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వం మారడానికి ముందు ఒక కొత్త, మెరుగయిన నాయకత్వం బాధ్యత స్వీకరించడానికి ఇది మంచి సమయం కాదని, సరయిన సమయం కాదని ఆలోచించకండి. మీరు మీ నలుపు, తెలుపు, గ్రే- అన్ని ఛాయలతో ముందుకు రావలసిందే’ అని శతృఘ్న సిన్హా మరో ట్వీట్‌లో మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ తన ప్రధానమంత్రి పదవీ కాలంలో చివరి వారం/నెలలోనే దేశంలోని ఉత్తరప్రదేశ్, బెనారస్, ఇతర ప్రాంతాలలో 150 ప్రాజెక్టులను ప్రకటించారని ఆయన చివరి ట్వీట్‌లో విమర్శించారు.
1990 నుంచి బీజేపీలో ఉన్న శతృఘ్న సిన్హా అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన శతృఘ్న సిన్హాను పార్టీలో పక్కకు పెట్టారు. అందుకే నరేంద్ర మోదీని, అతనికి నమ్మకస్తుడయిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి ‘వన్ మాన్ ఆర్మీ, టు-మాన్ షో’ అంటూ ఆయన తరచుగా విమర్శిస్తూ వచ్చారు. తాను వచ్చే ఎన్నికల్లో తిరిగి పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, అయితే బీజేపీ కాకుండా వేరే పార్టీ టికెట్‌పై పోటీ చేస్తానని శతృఘ్న సిన్హా సూచనప్రాయంగా వెల్లడించారు.