జాతీయ వార్తలు

అందరూ చౌకీదార్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 17: బీజేపీ మేమంతా కాపాలాదారులం ( చౌకీదార్) అనే నినాదంతో ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల కాలంలో ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ అనే పేరుపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. ప్రధానమంత్రి చౌకీదార్ కాదని, చోర్ అంటూ రాహుల్ ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలను తిప్పిగొట్టేందుకు పేరుకు ముందు చౌకీదార్ అని చేర్చాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ట్విట్టర్ అకౌంట్‌లో కూడా ఈ మేరకు మార్పులు చేసుకున్నారు. ఈ ప్రచారానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ ప్రజలను, ప్రధానంగా నెటిజన్లనుకోరింది. పార్టీ నేతలు, కేందమంత్రులు, ముఖ్యమంత్రులు మొదలుకుని సమాజంలో ప్రతి ఒక్కరు, ప్రతి విధిని నిర్వహించే వారు చౌకీదార్ అని వీడియో చిత్రాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్‌లో నామ్‌దార్ మోదీ అని మార్చుకున్నారు. జాతి సంరక్షకులే భద్రత గురించి ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారని బీజేపీ ప ఏర్కొంది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, ఇంకా ఇతర నేతలు చౌకీదార్ ట్యాగ్‌ను తగిలించుకున్నారు. మీకు సేవ చేసేందుకు ఈ చౌకీదార్ నిరంతరం పనిచేస్తున్నాడు. నేను ఒంటరివాడిన కాను. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి వ్యక్తి ఒక చౌకీదార్ పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి ఈ నెల 10వ తేదీ కంటే ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని పారంభించారు. 22 రాష్ట్రాల్లో వంద లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. రాజ్యసభ ఎంపీ, మీడియా విభాగం ప్రతినిధి అనిల్ బాలూనీ మాట్లాడుతూ, మేరా పరివార్, భాజాపా పరివార్‌తో ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. బీజేపీ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. త్రిపురలో ఈ ఏడాది జనవరి 5వ తేదీన ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే, మార్చి 7 వరకు 45 ర్యాలీల్లో ఆయన పాల్గొన్నార. మోదీ, షా ఇంకా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ప్రజలు మరోసారి మోదీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అనిల్ చెప్పారు.