జాతీయ వార్తలు

దమ్ముంటే అన్ని స్థానాల్లో పోటీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 18: ఉత్తరప్రదేశ్‌లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల విషయంలో గందరగోళం సృష్టించవద్దని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అదే సమయంలో దమ్ముంటే రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని ఆమె కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ ఓటమే లక్ష్యంగా చురుకుగా పనిచేస్తున్న ఈ మూడు పార్టీలకు కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు కేటాయించింది. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన స్థానాల విషయంలో కాంగ్రెస్ పార్టీ గందరగోళాన్ని సృష్టిస్తున్నందుకు బీఎస్పీ చీఫ్ మాయావతి ఒకింత మండిపడ్డారు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలకు లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 7 స్థానాలు మాత్రమే కేటాయిస్తామని, అంతకుమించి ఒక్కటి కూడా ఎక్కువగా ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరుచటిరోజే బీఎస్పీ చీఫ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. నాలుగు పార్టీల కూటమితో ఎన్నికల బరిలోకి దిగుతున్నందున తమ సీట్ల కేటాయింపులో తమ పార్టీ ఎలాంటి జోక్యం చేసుకోదని మాయావతి స్పష్టం చేశారు. అంతేకాకుండా బీఎస్పీ, ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలకు రాష్ట్రంలో అధికార బీజేపీని మట్టికరిపించగల సత్తా ఉందని ఆమె పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నిరభ్యంతరంగా సొంతంగా నామినేషన్లు వేసుకోవచ్చునని ఆమె చురకలంటించారు.
తమ కూటమికి కేటాయించిన 7 స్థానాల విషయంలో గందరగోళం సృష్టించవద్దని మరోసారి ఆమె ట్వీట్ ద్వారా హెచ్చరించారు. ఇదిలావుండగా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ భాగస్వామి కూటమి బీజేపీని ఓడించే సత్తా కలిగి ఉన్నాయన్న విషయాన్ని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మరో ట్వీట్ ద్వారా కాంగ్రెస్‌కు స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీ తమ కూటమికి కేటాయించిన 7 సీట్ల విషయంలో గందరగోళం సృష్టించవద్దని ఆయన హెచ్చరిస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్‌కు మద్దతు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోగానీ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా కూటమితో అవసరం లేకుండా లేదా కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకుని తమ పార్టీ పోటీ చేయబోదని బీఎస్పీ చీఫ్ మాయావతి మరో ట్వీట్ ద్వారా తెలిపారు. తమ కూటమికి కాంగ్రెస్ పార్టీ కేటాయించిన 7 స్థానాల్లో సృష్టిస్తున్న గందరగోళం నేపథ్యంలో ఆయా సీట్లలో పోటీ విషయంలో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవసరం లేదని ఆమె తమ పార్టీ కార్యకర్తలకు హితవు పలికారు.