జాతీయ వార్తలు

మోదీ ఎవరికి చౌకీదారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్‌బుర్గి, మార్చి 18: లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శల దూకుడును మరింత ఎక్కువ చేశారు. మోదీ ఆదివారం నాటి తన ఎన్నికల ప్రచారంలో తాను దేశానికి చౌకీదారుడునని, తనలాగే దేశంలోని ప్రతిఒక్కరూ కాపలాదారులుగా మారాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ సోమవారం ఉత్తర కర్నాటకలోని కాల్‌బురగిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ నుద్దేశించి విమర్శనాస్త్రాలను సంధించారు. రాఫెల్ యుద్ధవిమానాల డీల్ విషయంలో నిబంధనలను అతిక్రమించి రిలయన్స్ అధినేత అనిల్ అంబానీకి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా అప్పజెప్పిన మోదీ ‘చౌకీదార్ చోర్ హై’ (కాపలాదారే దొంగ)గా రాహుల్ అభివర్ణించారు. అలాంటి కాపలాదారే ఇపుడు దేశంలోని ప్రజలందర్నీ చౌకీదారులుగా మారాలని పిలుపునివ్వడాన్ని రాహుల్ తప్పుపట్టారు. శనివారం జరిగిన ఒక ప్రచార ర్యాలీలో మోదీ తన మద్దతుదారులను ఉద్దేశించి తాను ప్రధాన చౌకీదారుగా మారానని, సామాజిక రుగ్మతలు, అక్రమాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అంతా పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మోదీ దేశంలోని ప్రతిఒక్కర్నీ చౌకీదారుగా మారాలని పిలుపునిచ్చిన విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ ‘మోదీ దేశానికి కాపలాదారుగా పనిచేస్తానని ప్రకటించారు. కానీ ఆయన ఎవరికి కాపలాదారుగా వ్యవహరించాలనుకుంటున్నారు. వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి, విదేశాల్లో హాయిగా తిరుగుతున్న నీరవ్ మోదీకా, మెహూ చోక్సీకా, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న అనిల్ అంబానీకా, యుద్ధ విమానాల తయారీని ఎంతో అనుభవం కలిగిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు అప్పగించకుండా, ఎలాంటి అనుభవం లేకుండా, కోట్లాది రూపాయలు ముట్టజెప్పిన అనిల్ అంబానీకా? ఎవరికి మోదీ కాపలాదారుగా ఉండాలని అనుకుంటున్నారు’ అని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. మీరు దాచాలనుకున్నా వాస్తవాలు ఎన్నడూ ఆగవు అంటూ మోదీ చౌకీదారు ప్రచార కార్యక్రమంపై రాహుల్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా ఆ పార్టీ నాయకులంతా అవినీతి, అక్రమాల్లో మునిగితేలుతున్నారని, అలాంటివారు ఇపుడు లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఓటేయాలని ప్రజలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని రాహుల్ ధ్వజమెత్తారు. తనను తాను చౌకీదారుగా వ్యవహరించుకుంటున్న మోదీ 3,50,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని, కానీ రైతుల రుణాలు మాఫీ చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కనీస ఆదాయ పథకం గురించి ఏఐసీసీ చీఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో కనీస వేతనాన్ని డిపాజిట్ చేస్తామని భరోసా ఇచ్చారు.
చిత్రం.. ఉత్తర కర్నాటకలోని కాల్‌బుర్గిలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ అభివాదం