జాతీయ వార్తలు

పాక్ జాతీయ దినోత్సవాన్ని బహిష్కరించిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ప్రతి ఏటా జరిగే పాక్ జాతీయ దినోత్సవ కార్యక్రమాన్ని భారత్ బహిష్కరించింది. ఈ కార్యక్రమానికి కాశ్మీర్‌కు చెందిన వేర్పాటు వాదులను కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సారి ఈ కార్యక్రమానికి భారత్ ప్రభుత్వం తరఫున ప్రతినిధిని పంపడం లేదని కేంద్రం తెలిపింది. గతంలో కేంద్ర మంత్రి హోదాలో ఒక నేత హాజరయ్యేవారు. హురియత్ కాన్ఫరెన్సుకు చెందిన బృందాన్ని కూడా ఆహ్వానించాలని పాక్ రాయబార కార్యాలయం నిర్ణయించింది. ప్రతి ఏడాది మార్చి 23వ తేదీన లాహోర్ తీర్మానానికి గుర్తుగా పాకిస్తాన్ జాతీయ దినోత్సవం నిర్వహిస్తుంది. హురియత్ కాన్ఫరెన్సు లేదా వేర్పాటు వాదులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే సీరియస్‌గా తీసుకుంటామని భారత్ విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. పాకిస్తాన్‌లో కూడా భారత్ హైకమిషనర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని చెప్పారు. గత ఏడాది ఇక్కడ ఈ కార్యక్రమానికి కేంధ్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామా వద్ద ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి విదితమే. ఆ తర్వాత పాకిస్తాన్‌లోని బాలాకోట్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసి ధ్వంసం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.