జాతీయ వార్తలు

లోక్‌పాల్‌గా ఘోష్ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి ఘోష్‌తో దేశ తొలి లోక్‌పాల్‌గా పదవీస్వీకార ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పదవీస్వీకార ప్రమాణం చేయించినట్టురాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దేశ తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి ఘోష్ పేరును మంగళవారం ప్రకటించారు. వివిధ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు- దిలీప్ బీ బోసలే, ప్రదీప్ కుమార్ మొహంతి, అభిలాష కుమారితో పాటు చత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అజయ్ కుమార్ త్రిపాఠి లోక్‌పాల్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. సశస్త్ర సీమా బల్ మాజీ తొలి మహిళా చీఫ్ అర్చనా రామసుందరం, మాజీ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ జైన్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి మహేందర్ సింగ్, గుజరాత్ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి ఇంద్రజీత్ ప్రసాద్ గౌతమ్ లోక్‌పాల్‌లో నాన్-జ్యుడీషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. 66 ఏళ్ల జస్టిస్ ఘోష్ 2017 మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ పొందారు. తొలి లోక్‌పాల్‌గా అతడి పేరును ప్రకటించేనాటికి అతను జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడిగా పనిచేస్తున్నారు. కొన్ని కేటగిరీల ప్రజా సేవకులపై వచ్చే అవినీతి అభియోగాలపై విచారించేందుకు కేంద్రంలో లోక్‌పాల్‌ను, రాష్ట్రాల్లో లోకాయుక్తలను నియమించేందుకు వీలు కల్పించే లోక్‌పాల్, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం లోక్‌పాల్ కమిటిలో ఒక చైర్‌పర్సన్, గరిష్ఠంగా ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. వీరిలో నలుగురు జ్యుడీషియల్ సభ్యులు అయి ఉండాలి. మొత్తం సభ్యుల్లో కనీసం 50 శాతం మంది సభ్యులు ఎస్‌సీ, ఎస్‌టీ, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీ వర్గాలకు చెందిన వారు, మహిళలు ఉండాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.

చిత్రం.. దేశ మొట్టమొదటి లోక్‌పాల్‌గా పదవీ స్వీకారం చేసిన విశ్రాంత న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్‌తో
రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్