జాతీయ వార్తలు

ఆ బాలుడు.. మృత్యుంజయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిసార్ (హర్యానా), మార్చి 22: ఆ పసిబాలుడు మృత్యుంజయుడు. 48 గంటల తర్వాత బోరుబావి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో 18 నెలల పసిబాలుడు నదీమ్ బతికి బట్టకట్టాడు. ఈ ఘటన హర్యానాలోని హిసార్‌లో జరిగింది. 60 అడుగుల బోరుబావిలో ఆడుకుంటూ పడిపోయిన ఈ బాలుడికి ప్రాణాపాయం కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అదికారులు చెప్పారు. ఈ ఘటన హిసార్‌కు సమీపంలోని బాల్సామండ్ గ్రామంలో జరిగింది. పసిబాలుడిని బోరుబావి నుంచి బయటకు తెచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ జోగీందర్ సింగ్ చెప్పారు. 48 గం. నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టామన్నారు. జాతీయ విపత్తు సహాయక బృందం, ఆర్మీ నిపుణులు సంఘటనా ప్రదేశానికి వచ్చి పసిబాలుడిని రక్షించారు. జిల్లాలో ప్రమాదకరమైన బోరుబావులను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.