జాతీయ వార్తలు

పాక్ కాల్పులు.. జవాను మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: జమ్మూలో వాస్తవాధీన రేఖ వెంట పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక జవాను అమరుడయ్యాడు. ఈ ఘటన పూంఛ్ సెక్టార్‌లో జరిగింది. శనివారం ఉదయం షహపూర్, కెర్నీ ప్రాంతాల్లో సరిహద్దు వెంట పాక్ సైన్యం కాల్పులకు దిగింది. కవ్వింపు చర్యలు లేకుండా ఈ కాల్పులకు పాక్ సైన్యం పాల్పడినట్లు అధికారులు చెప్పారు. ఈ కాల్పులను భారత్ ఆర్మీ ధీటుగా తిప్పిగొట్టింది. ఈ ఘటనలో ఒక జవాను మరణించాడు. గాయపడిన జవానును ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. గత గురువారం యాష్ పాల్ అనే జవాను మరణించాడు. గత నెల పుల్వామా ఘటన జరిగినప్పటి నుంచి సరిహద్దుల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 2003లో ఇరుదేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తోందిన భారత్ ఆర్మీ పేర్కొంది.

చిత్రం.. జేకేఎల్‌ఎఫ్‌పై నిషేధం విధించడంతో వేర్పాటువాదులు ఆదివారం బంద్‌కు పిలుపునివ్వడంతో శ్రీనగర్‌లో మూతపడిన దుకాణాలు... పహారా కాస్తున్న బలగాలు