జాతీయ వార్తలు

పాపం.. ములాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 25: సాక్షాత్తూ పార్టీ వ్యవస్థాపకుడికే ప్రచార తార హోదా కల్పించలేదంటే ఆయనపై ఆ పార్టీ నేతలకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దెప్పిపొడిచారు. సార్వత్రిక ఎన్నికల నిమిత్తం యూపీలో సమాజ్‌వాద్ పార్టీ తరఫున ప్రచారం చేసే నిమిత్తం ఆ పార్టీ విడుదల చేసిన 40 మంది స్టార్ కేంపైనర్స్ లిస్టులో ములాయం సింగ్ పేరు మొదటి లిస్టులో లేదు. అయితే దానిపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో ఆదివారం ఆయన పేరును చేర్చారు. దీనిపై యోగి ట్వీట్ చేస్తూ ‘చూశారా.. సాక్షాత్తూ పార్టీ వ్యవస్థాపకుడికే ఎంత కష్టం వచ్చిందో.. ఆయన పేరును తొలగించింది పార్టీలోని వేరే ఎవరో కాదు.. ఆయన కుమారుడే స్వయంగా లిస్టులో ఆయన పేరు లేకుండా చేశారు’ అని విమర్శించారు. సమాజ్‌వాద్ పార్టీని స్థాపించి, తన సోదరునితో కలిసి కనీసం కాళ్లకు చెప్పులైనా లేకుండా ఇంటింటికీ తిరిగి దానిని పటిష్టం చేసి రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన ములాయం సింగ్‌కు ఆ పార్టీ నేతలు ఇచ్చిన గౌరవం చూశారా? అని ఆయన ములాయంసింగ్, అఖిలేష్ పేర్లు ప్రస్తావించకుండా ఎద్దేవా చేశారు. కుమారుడు అయోగ్యుడు అయినప్పుడు సంపదను కూడగట్టాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ కుమారుడు సమర్థుడైతే ఎందుకు సంపాదించాలి? అని ఆయన ములాయంను ప్రశ్నించారు. ములాయంకు చిరకాల ప్రత్యర్థి అయిన మాయావతితో అఖిలేష్ యాదవ్ పొత్తు పెట్టుకుని ఆయనను తీవ్ర మానసిక వేదనకు గురి చేశారని యోగి పేర్కొన్నారు. తన తండ్రి, అంకుల్ మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల్లో లబ్ధి కోసం శత్రువుతో చేతులు కలిపాడని విమర్శించారు. ఇలా అవకాశవాద పొత్తులు పెట్టుకున్న పార్టీలకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సాక్షాత్తూ పార్టీని స్థాపించిన కన్న తండ్రికే ద్రోహం చేసిన వ్యక్తి ఇక ప్రజలకు ఏం చేస్తాడో ఆలోచించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.