జాతీయ వార్తలు

రైలు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత్‌సర్, అక్టోబర్ 20: పంజాబ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఇశ్రాయెల్ పర్యనటను వాయిదా వేసుకున్న సీఎం రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అమరీందర్ మెజిస్టీరియల్ దర్యాప్తును ఆదేశించినట్టు ప్రకటించారు. ప్రమాదంపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జలంధర్ డివిజనల్ కమిషనర్‌కు విచారం బాధ్యతలను అప్పగించారు. అమృత్‌సర్‌లోని జోదాపాఠక్ వద్ద జరిగిన ప్రమాదంలో 61 మంది మృతి చెందారు. కనీసం 60 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గాయపడ్డవారి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగిన అమరీందర్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. సహాయ కార్యక్రమాలపై సీఎం ఆరాతీశారు. ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ వెంట ఆరోగ్య మంత్రి మొహీందర్, స్థానిక సంస్థల మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ, విద్యాశాఖ మంత్రి ఓపీ సోని, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ ఉన్నారు.