జాతీయ వార్తలు

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గబోరోనే (బోత్స్వానా), నవంబర్ 1: భారతదేశంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
ఆర్థిక సంస్కరణలు వేగవంతమయ్యాయని, పారిశ్రామిక రంగం పరుగులు తీస్తోందని ఆయన చెప్పారు. ఇక్కడ 13వ గ్లోబల్ ఎక్స్‌పో బోత్స్వానా 2018 సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. బోత్స్వానా, జింబాబ్వే, మాలవీ దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ ప్రదర్శనలో 25 భారతీయ కంపెనీలు పాల్గొన్నాయన్నారు. ఆఫ్రికాలో అభివృద్ధి ఊపందుకునేందుకు బోత్స్వానా చేస్తున్న కృషిని ఆయన శ్లాఘించారు. సమిష్టికృషితో పరిశ్రమల రంగంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు. వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తే పారిశ్రామికవేత్తలు ఆసక్తిని కనపరుస్తారన్నారు. మానవ జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఆఫ్రికా ఖండంలోని దేశాలతో ఉమ్మడిగా పనిచేసి అభివృద్ధి అంశంపై సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం మార్చుకోవాలన్నారు. ఆఫ్రికా దేశాలతో భారత్‌కు మొదటి నుంచి బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఆఫ్రికాలో10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టాలని భారత్ ఇప్పటికే హామీ ఇచ్చిందన్నారు. దీనికి తోడు 600 మిలియన్ డాలర్ల విలువ చేసే 50 వేల ఉపకారవేతనాలు ఇస్తామన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం విలువ 1.75 బిలియన్ డాలర్లు ఉందన్నారు. భారతదేశంలో వస్తు సేవా పన్నును ప్రవేశపెట్టడం వల్ల మంచి సంస్కరణల పలితాలను సాధిస్తున్నట్లు చెప్పారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మంచి ర్యాంకు భారత్‌కు వచ్చిందన్నారు. ఈ రోజుభారత్‌లో పారిశ్రామిక రంగం వెల్లివిరుస్తోందన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇండస్ట్రియల్ కారిడార్స్, స్మార్ట్ సిటీ అభివృద్ధిని కేంద్రం చేపట్టిందన్నారు.