జాతీయ వార్తలు

రాముడి పేరిట దీపాలు వెలిగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిద్వార్, నవంబర్ 4: అయోధ్యలో రామాలయాన్ని త్వరలోనే నిర్మిస్తామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఉద్ఘాటించారు. దేశంలో రామభక్తులందరూ ఇందుకు సంబంధించి శుభవార్త వినబోతున్నారని, దీపావళి రోజున రాముడి పేరిట దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో ఎంతో అట్టహాసంగా దీపావళిని నిర్వహించుకోబోతున్నామని, ఈ వేడుకలో పాల్గొనేందుకు దక్షిణ కొరియా బృందం వస్తోందని తెలిపారు. ఇక్కడి పతంజలి యోగ పీఠంలో రెండు రోజుల పాటు జరిగిన జ్ఞాన్‌కుంభ్ ముగింపు సభలో ఆదివారం మాట్లాడిన ఆదిత్యనాథ్ ‘అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణ శుభవార్త వినేందుకు రామభక్తులు దీర్ఘకాలం పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదు’ అని ఉద్ఘాటించారు. దేశంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, పరీక్షల్లో విద్యార్థులు తప్పుడు పద్ధతులకు పాల్పడితే అందుకు టీచర్లనే బాధ్యుల్ని చేయాలని అన్నారు. ఈ రకమైన కఠిన చర్యల వల్ల దేశ విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు వస్తాయని, ఈ విధానానికి ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో శ్రీకారం చుట్టామని ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగి ఆదిత్యనాధే దేశ భవిత అని, బీజేపీ ఎంపీలందరూ రామాలయ నిర్మాణానికి సంబంధించి పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని యోగా గురు రామ్‌దేశ్ అన్నారు.