జాతీయ వార్తలు

వారణాసి-హాల్డియా జల రవాణా వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: వారణాసిలో గంగానదిపైన తొలి జల రవాణా మార్గం ఏర్పాటుకు నిర్మించిన బహుళ టర్మినల్ వ్యవస్థను ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 12వ తేదీ సోమవారం జాతికి అంకితం చేస్తారు. తక్కువ ఖర్చు, పర్యావరణ పరిరక్షణకు జలరవాణా ఉపయోగపడుతుంది. ఈ నదిపై జల రవాణా అభివృద్ధికి మూడు టర్మినల్స్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో తొలి టర్మినల్ నిర్మాణం పూర్తయింది. కేంద్రం ఆధ్వర్యంలోని జల మార్గ్ వికాస్ ప్రాజెక్టు కింద వీటిని నిర్మించారు. వారణాసి నుంచి హాల్డియా వరకు తక్కువ ఖర్చుతో పెద్ద ఓడలు గంగానదిలో పెద్ద మొత్తంలో సరుకులను చేరవేస్తాయి. 1500 నుంచి 2000 వరకు టన్నుల బరువు ఉన్న సరకులను ఈ ఓడలు రవాణా చేస్తాయి. ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ టర్మినల్స్‌ను నిర్మించింది. జాతీయ జల రహదారి-1గా నామకరణం చేశారు. ప్రపంచ బ్యాంకు ఆర్థికసహాయంతో రూ. 5369.18 కోట్లతో నిర్మిస్తున్నారు. కేంద్రప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు చెరిసగం నిధులను భరిస్తాయి. వారణాసి-సాహిబ్‌గంజ్-హాల్డియా మధ్య ఓడలు తిరుగుతాయి. వారణాసి వద్ద నిర్మించిన టర్మినల్ వల్ల 500 మందికి, 2000 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. కోల్ కొతాలో గత నెల 30వ తేదీన బయలుదేరిన ఓడను ప్రధాని నరేంద్రమోదీ సాదరపూర్వకంగా ఆహ్వానిస్తారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి సారిగా జలరవాణాను ఏర్పాటు చేసిన ఘనత మోదీకి దక్కుతుంది. ఎంవీ రబీంద్రనాథ్ టాగూర్ ఐడబ్ల్యుఏఐ ఓడలో 16 ట్రక్కు లోడ్‌ల ఆహారం, స్నాక్స్ వస్తున్నాయి. అనంతరం ఇఫ్కో నుంచి ఎరువులను తీసుకెళుతుంది. బాబట్‌పూర్ వారణాసి ఎయిర్‌పోర్టు రోడ్డు, వారణాసి రింగ్ రోడ్డుకు నిర్మించిన లరెండు జాతీయ రహదారి ప్రాజెక్టులను కూడా మోదీ జాతికి అంకితం చేస్తారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కింద కొన్ని ప్రాజెక్టు పనులను శంకుస్థాపన చేస్తారు.