జాతీయ వార్తలు

అనంత్‌కుమార్‌కు అంతిమ వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 13: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్‌కుమార్ అంత్యక్రియలు మంగళవారం అశ్రు నయనాల నడుమ ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడి చామరాజపేట శ్మశానవాటికలో జరిగాయి. వందలాది మంది ఈ కార్యక్రమానికి హాజరై ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆఖరి సోదరుడు నందకుమార్ స్మార్థబ్రాహ్మణ ఆచారాల మేరకు వేద మంత్రోచ్ఛారణల నడుమ అనంత్‌కుమార్ చితికి నిప్పంటించారు. అంతకుముందు అనంత్‌కుమార్ పార్ధివదేహంపై త్రివర్ణ పతాకాన్ని కప్పి, సైనికులు గాలిలో తుపాకీ పేల్చి గౌరవవందనం సమర్పించారు. ఈ సందర్భంగా అనంత్‌కుమార్ సతీమణి తేజస్విని, కుమార్తెలు ఐశ్వర్య, విజేతతోబాటు ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ జాతీయ నాయకులు కన్నీటిపర్యంతం అయ్యారు. చితికి నిప్పంటించే సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు ‘్భరత్ మాతాకీ జై..అనంత్‌కుమార్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఉప ప్రధాని, సీనియర్ నేత ఎల్‌కే అధ్వానీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, మహేష్ శర్మ, విజయ్ గోయల్, సదానంద గౌడ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ కర్నాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు నేతృత్వంలో బీజేపీ శ్రేణులు ఉదయం బసవనగుడిలోని అనంత్‌కుమార్ నివాసం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత పార్థివదేహాన్ని నివాసం వద్దనుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం జగన్నాథ్ భవన్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అలాగే దివంగత కుమార్ సొంత పార్లమెంట్ నియోజకవర్గం దక్షిణ బెంగళూరులోని నేషనల్ కాలేజీ గ్రౌండ్స్‌కు తరలించి అక్కడకూడా కొంతసేపు ఉంచారు. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన అనంత్‌కుమార్‌కు ఈ గ్రౌండ్‌తో మంచి అనుబంధం వుంది. అనేక రాజకీయ సమావేశాలను ఆయన ఇక్కడ నిర్వహించారు. కాగా తర్వాత అలంకరించిన సైనిక వాహనంపై అనంత్‌కుమార్ అంతిమయాత్ర ప్రారంభమైంది. సైన్యంలోని వైమానిక, నేవీ, పదాతి దళాలు ముందు నడువగా పెద్దసంఖ్యలో పార్టీశ్రేణులు పాల్గొన్నాయి.