జాతీయ వార్తలు

మహాబలుడు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: బీజేపీ ప్రమాదకరమైన పార్టీనా కాదా అనే విషయాన్ని ప్రజలు తేలుస్తారని తమిళ సినీ సూపర్‌స్టార్, క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన రజనీకాంత్ మంగళవారం ఇక్కడ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఆయనను వ్యతిరేకించే పది పార్టీల కంటే బలమైన వారని చెప్పగలనని ఆయన పేర్కొన్నారు. ‘ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పది మంది కూటమిని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎవరు బలమైన వ్యక్తి ? ఆ పది మంది ఒక వ్యక్తిపైన యుద్ధం ప్రకటిస్తే, ఎవరు బలమైన వ్యక్తి అని ప్రజలు నిర్ణయిస్తారని రజనీకాంత్ తార్కిక ధోరణిలో బదులిచ్చారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీనా కాదా అనేది ప్రజలు తేల్చాలని అంశమన్నారు. రజనీకాంత్ బీజేపీని సమర్థిస్తున్నారా ? లేదా విమర్శిస్తున్నారా ? గత రెండు రోజుల్లో వివిధ సందర్భాల్లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయపార్టీల నేతలను, ఆయన అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. తమిళనాడులో, దేశంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఎక్కువ సంఖ్యలో పార్టీలు కూటమిని ఏర్పాటు చేస్తున్నాయి. బీజేపి ప్రతిపక్షాలకు ప్రమాదకరంగా పరిణమించిందని రజనీకాంత్ సోమవారం వ్యాఖ్యానించారు. అన్ని విపక్షాలు భావిస్తే బీజేపీ నిజంగా ప్రమాదకరమైన పార్టీగానే భావించాలని ఆయన అన్నారు. మంగళవారం ఆయన మళ్లీ ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ బీజేపీ ప్రమాదకరమైనపార్టీ అనే విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనన్నారు. ప్రజలు నిర్ణయించాల్సిన విషయంపై తాను ఎలా చెబుతానన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఎన్డీయేతర పార్టీలు జట్టుకడుతున్న సమయంలో రజనీకాంత్ రెండు రోజుల వ్యవధిలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.