జాతీయ వార్తలు

రాఫెల్‌పై కట్టుకథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో దోపిడీ జరిగిందన్న విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సుప్రీం కోర్టు ముందే అంగీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే వైమానిక దళాన్ని సంప్రదించకుండానే ఈ కాంట్రాక్టులో మార్పులు చేసిన విషయాన్ని ఆయన ఒప్పుకున్నారని రాహుల్ అన్నారు. రాఫెల్ ఒప్పందం పద్ధతి ప్రకారం సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం 14 పేజీల నివేదికను సోమవారం సమర్పించిన నేపథ్యంలో రాహుల్ తన స్వరాన్ని మరింత పెంచారు. సుప్రీంకు ఇచ్చిన నివేదికలో ఈ ఒప్పందానికి సంబంధించి కేంద్రం మరింతగా తన తప్పులను ఒప్పుకుందని రాహుల్ ట్వీట్ చేశారు. ఆ విధంగా 30 వేల కోట్ల రూపాయలను అంబానీ జేబులో పెట్టారని, ఇందుకు సంబంధించి మరింత స్పష్టమైన వివరాలు వెలుగు చూడాల్సి ఉందని అన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న వివాదాలు మంగళవారం మరింత తీవ్రమైంది. ఈ ఒప్పందంలో ఎలాంటి తప్పిదం జరగలేదని డసాల్ట్ సీఈఓ చెప్పడాన్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తుంగలో తొక్కేందుకు, తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జేవాలా, ఆనంద్ శర్మ ధ్వజమెత్తారు. ఈ డీల్‌కు సంబంధించి నిజాయితీతో కూడిన దర్యాప్తునే దేశప్రజలు కోరుతున్నారని, అంతేగాని తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే వివరణలను కాదని సుర్జేవాలా తెలిపారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో రాఫెల్ ఒప్పందాన్ని డసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాఫియర్ సమర్థించుకోవడం, 58 వేల కోట్లరూపాయల ఒప్పందం అంతా ఎలాంటి లోపాయికారీ వ్యవహారాలకు తావులేకుండా నిజాయితీగానే జరిగిందని ఆయన చెప్పడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. తమకు అనుకూలంగా ఎన్డీఏ సర్కార్ ఈ ఇంటర్వ్యూని మలచుకుంటుందని, అబద్ధాల పుట్టలను సృష్టిస్తోందని ధ్వజమెత్తిన సుర్జేవాలా, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఇందుకు సంబంధించి డసాల్ట్ ఎన్ని వివరణలు ఇచ్చినా అది కూడా సహ నిందిత సంస్థ కాబట్టి దాని ప్రకటనలకు ఎలాంటి విలువ లేదని పేర్కొన్నారు.
ఏ తప్పూ జరగలేదు
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ స్పష్టం చేసింది. భారత వైమానిక దళానికి 36 ఫైటర్ జెట్లను సమకూర్చే ఉద్దేశంతో భారత్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక ప్రపంచ ప్రఖ్యాత సంస్థ సీఈఓగా తాను ఎలాంటి అబద్ధాలు చెప్పనని ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన ట్రాఫియర్ తనను అబద్ధాలకోరుగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబాని కంపెనీ ఆఫ్‌సెట్ పార్టనర్‌గా పరిగణిస్తూ తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపైన, అలాగే చాలా ఎక్కువ రేటుకే ఈ విమానాలను కొన్నారన్న ఆరోపణలపై కూడా ట్రాఫియర్ స్పందించారు. తమ కంపెనీకి అనీల్ అంబాని సారథ్యంలోని రిలయన్స్ డిఫెనే్స ఆఫ్‌సెట్ పార్టనర్ కాదని ఆయన తెలిపారు. అలాగే యూపీఏ హయాంలో కుదిరిన ఈ ఒప్పందం కంటే కూడా ఎన్డీఏ కుదుర్చుకున్న ఒప్పందమే వ్యయభరితమన్న వాదనను ఆయన పాక్షికంగా తిరస్కరించారు.