జాతీయ వార్తలు

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అభివృద్ధికి చేసిన కృషి, నవ భారత నిర్మాణానికి చేసిన ప్రణాళికలను తక్కువ చేసి చూపుతున్నారని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ రాసిన నెహ్రూ అనే పుస్తకాన్ని ఆమె ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. భారత దేశంలో రాజకీయ రంగంలో నైతిక విలువలను ప్రోత్సహించిన మహానేత నెహ్రూ అని, ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉండేందుకు బలమైన పునాదులు నిర్మించారన్నారు. నెహ్రూ ఆలోచనా విధానాల్లో భారతీయతత్వం ప్రతిబింబించేందన్నారు. కాని ప్రగతిశీల భావాలను అణగదొక్కే విధంగా ప్రస్తుత ప్రభుత్వం తీరు ఉందని ఆమె విమర్శించారు. ఈ రోజు నెహ్రూ ఆలోచనా విధానాలు, అభివృద్ధికి తీసుకున్న చర్యలు, విధానాలపై ప్రస్తుత ప్రభుత్వం ప్రతి రోజూ దాడి చేస్తోందన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పనితీరు అధ్వాన్నంగా తయారైందని, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే శక్తులపై నెహ్రూ రాజీలేకుండా పోరాడారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడమే కాకుండా నిర్మాణాత్మకమైన విమర్శలను నెహ్రూ ప్రోత్సహించారన్నారు. ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ ఈ రోజు ఒక ఛాయ్ వాలా ప్రధాని అయ్యారంటే, నెహ్రూ నిర్మించిన బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ వల్లనే సాధ్యమైందన్నారు. ఒక భారతీయుడు ఇంటా బయట ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారంటే, దేశ నిర్మాణానికి శక్తివంతమైన పునాదిని నెహ్రూ నిర్మించారన్నారు.