జాతీయ వార్తలు

పది మందితో రెండో జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: కాంగ్రెస్ అధినాయకత్వం బుధవారం తెలంగాణ శాసనసభకు పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. పది మందితో కూడిన ఈ జాబితాలో రెడ్డి వర్గానికి మరోసారి పెద్దపీట వేసింది. వీరితోపాటు ఒక ఎస్సీ, ఎస్టీ, ఇద్దరు వెనుకబడిన కులాల వారున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు క్యామా మల్లేష్ తదితర సీనియర్ నాయకులకు రెండో జాబితాలోనూ అధినాయకత్వం మొండిచెయ్యి చూపించింది. ఖానాపూర్ (ఎస్టీ) రమేష్ రాథోడ్‌కు, ఎల్లారెడ్డి సీటును జాజుల సురేందర్, ధర్మపురి (ఎస్సీ) టికెట్‌ను ఏ.లక్ష్మణ్‌కుమార్, సిరిసిల్ల కె.మహేందర్ రెడ్డి, మేడ్చెల్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్ టికెట్ శ్రావన్ దాసోజీ, జూబ్లీహిల్స్ పి.విష్ణువర్దన్‌రెడ్డి, షాద్‌నగర్ సి.ప్రతాప్ రెడ్డి, భూపాలపల్లె గండ్ర వెంకటరమణారెడ్డి, పాలేరు కె.ఉపేందర్‌రెడ్డికి కేటాయించారు. కాంగ్రెస్ అధినాయకత్వం బుధవారం ప్రకటించిన పది సీట్లను కలుపుకుంటే ఇంతవరకు మొత్తం 75 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మొదటి జాబితాపై నిరసనలు వ్యక్తమైనట్లే రెండో జాబితాపై కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమైంది. కాంగ్రెస్ అధినాయకత్వం కేవలం ఒక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తోంది.. రాష్ట్ర జనాభాలో దాదాపు 55 శాతం ఉన్న వెనుకబడిన కులాలవారికి పూర్తిస్థాయిలో అన్యాయం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాబితాలో తన పేరు ఉంటుందని ఆశించిన పొన్నాల లక్ష్మయ్య మరోసారి నిరాశకు గురయ్యారు. అయినప్పటకీ జనగామ అసెంబ్లీ నియోజవర్గం నుండి కాంగ్రెస్ తరపున తానే పోటీ చేస్తానన్నారు. ఇక్కడి నుండి ఇతరులు పోటీచేసే అవకాశం ఎంతమాత్రం లేదని ఆయన వాదిస్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ తనకు టికెట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితి లేదన్నారు. కోదండరాం జనగామ నుండి పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.