జాతీయ వార్తలు

సీఈవోపై ఈసీ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: మిజోరం రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి(సీఈవో) ఎస్‌బీ శశాంక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. శశాంక్‌ను తప్పించాలని అఖిల భారత సర్వీసు అధికారుల సంఘం, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. బ్రూ ఓటర్ల గుర్తింపునకు సంబంధించి ఐఎఎస్‌లు, సీఈవో మధ్య వివాదం తలెత్తింది. రెండుమూడు వారాలుగా ఈ వివాదం నడుస్తోంది. శశాంక్ ఉంటే ఎన్నికల సజావుగా, స్వేచ్ఛగా జరగవని ఐఎఎస్‌లు ఈసీకి తెలిపారు. సీఈవోపై ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆయనపై తప్పించి, ఆ స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అశిష్ కుంద్రాను నియమించారు. త్రిపుర పునరావాస శిబిరంలో బ్రూ ఓటర్లను పోలింగ్‌కు అనుమతించే విషయంలో వివాదం మొదలైంది.‘మిజోరం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాత ఎస్‌బీ శశాంక్‌ను తొలగించాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. శశాంక్ స్థానంలో అశిష్ కుంద్రాను నియమించాం’ అంటూ ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శశాంక్ స్థానంలో అర్హులైన అధికారులు జాబితా ఇవ్వాలని ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. సీఈవోను ఈశాన్య రాష్ట్రాల్లో ఉంచొద్దని, ఆయనను తక్షణం తొలగించాలని ఐఏఎస్ అధికారుల సంఘం, మిజోరం విద్యార్థుల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. త్రిపుర పునరావాస కేంద్రాల్లో ఉన్న 11,232 మంది బ్రూ ఓటర్లను మిజోరం పోలింగ్ స్టేషన్లలో ఓట్లు వేయడానికి అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ముందు సీఈవో ఫిర్యాదు మేరకు రాష్ట్ర హోమ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లాల్‌నున్‌మావియా ఛౌంగోపై ఈసీ వేటు వేసింది. బ్రూ ఓటర్లకు సంబంధించి శశాంక్ ఆదేశాలు ఇచ్చిన తరువాత వాటిని తోసిరాజని చౌంగో ఆదేశాలివ్వడం వివాదానికి కారణమైంది. కాగా ఛౌంగో జరిగిన వివాదంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ‘శశాంక్ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయనను తప్పిస్తేనే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి’అని లేఖలో పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి రంగంలో దిగిన ఈసీ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ను ఐజ్వాల్‌కు పంపించింది. ఆందోళనకారులతో సంప్రదించారు.