జాతీయ వార్తలు

సుప్రీంకోర్టుకెక్కిన మరో సీబీఐ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐలో కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. తనను తన మాతృ సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరోకు బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ ఒక సీబీఐ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు అన్యాయం చేశారని, దురుద్దేశ్యంతో బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. డిప్యూటీ ఎస్పీ హోదాలో పనిచేస్తున్న ఆ అధికారి పేరు అశ్విని కుమార్ గుప్తా. తాను సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాపై వివిధ అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేస్తున్నానని చెప్పారు. తాను ఇంటెలిజెన్స్‌బ్యూరోలో 1999లో చేరినట్లు చెప్పారు. సీబీఐకు 2014లో డిప్యూటేషన్‌పై వచ్చానన్నారు. మూడేళ్ల పాటు 2017 వరకు సీబీఐలో పనిచేశానన్నారు. అనంతరం ఒక ఏడాది పాటు డిప్యూటేషన్‌ను పొడిగించారన్నారు. దీనికి తన మాతృ సంస్థ ఐటీ నిరభ్యంతర పత్రం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత సీబీఐ తనకు మరో ఏడాది సర్వీసును పొడిగిస్తూ నిరభ్యంతర పత్రం కావాలని ఐబీని కోరినట్లు చెప్పారు. 2018లో ఐబీ ఈమేరకు నిరభ్యంతర పత్రం ఇచ్చిందన్నారు. కాగా ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీన తనను ఐబీకీ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. జూన్‌లోనే ఒక ఏడాది పాటు తనకు డిప్యూటేషన్‌పై సీబీఐలో పనిచేసేందుకు ఐబీ అనుమతి ఇవ్వగా ఆకస్మికంగా బదిలీ చేయడం తగదన్నారు. రాకేష్ అస్తానాపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తు చేస్తున్నందుకు తనను బదిలీ చేశారన్నారు. అస్తానాపై వచ్చిన అభియోగాలకు సాక్ష్యాధారాలు లభించాయన్నారు.