జాతీయ వార్తలు

మేడ్ ఇన్ ఇండియా మేనేజర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: మనవాళ్లు ఎక్కడికి వెళ్లినా తమదైన ముద్రతో రాణించేస్తారు! ఎలాంటి అంతర్జాతీయ కంపెనీకైనా సారథ్యం వహించి ఔరా అన్న రీతిలో వాటిని లాభాల బాట పట్టిస్తారు. ఇందుకు గూగుల్‌లో సుందర్ పిఛాయ్, మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల, పెప్సీ సారథి ఇంద్రా నూయితో పాటు ఎందరో భారతీయులు నిలువుటద్దంగా నిలుస్తున్నారు. అందుకే మనవాళ్లకు అంతర్జాతీయంగా ఎంత పేరు వచ్చినా, ఎంతటి ఘనమైన కంపెనీకి సారథ్యం వహించినా భారతీయులకు విడ్డూరంగా అనిపించదు. ఎందుకంటే మన సత్తాపై మనకు అంత నమ్మకం ఉండటమే. ఇంతకీ భారతీయ మేనేజర్లు ఇంతగా అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య, ఇతర రంగాల్లో ఇంతగా రాణించడానికి కారణమేమిటి? వారు కొడుతున్న హిట్ల మీద హిట్ల వెనుక ఉన్న పరమార్థమేమిటన్నది ఆసక్తి కలిగించే అంశమే. మేడ్ ఇన్ ఇండియాగా భారతను ఉత్పాదక కేంద్రంగా మార్చాలన్న ఆలోచనకు అద్దం పట్టేలా మేడ్ ఇన్ ఇండియా మేనేజర్లుగా మనవాళ్లు ఇప్పటికే అంతర్జాతీయంగా లబ్ధప్రతిష్ఠులయ్యారు. వీరి ప్రతిభా సంపత్తులకు సంబంధించి ఓ లోతైన పుస్తకం రాబోతోంది. ఇందులో మనవాళ్ల ప్రతిభను క్షుణ్ణంగా విశే్లషించడంతో పాటు భారత యువతలో నిబిడీకృతమై ఉన్న సత్తానూ వెలుగులోకి తేబోతున్నారు. పద్దెనిమిదేళ్లు, ఆ తర్వాత కొంత కాలం పాటు భారత్‌లోనే చదువుకుని అంతర్జాతీయ సంస్థల్లో రాణిస్తున్న అనేక మంది గురించి ఈ పుస్తకంలో వివరిస్తున్నారు. వారి విజయం వెనుక ఉన్న రహస్యాన్నీ నేటి యువతకు స్ఫూర్తిదాయక రీతిలో అందిస్తున్నారు. అమెరికన్ల తర్వాత ఎస్ అండ్ పి 500 కంపెనీల్లో అత్యధిక సంఖ్యలో సీఈఓలుగా ఉన్నది భారతీయులే. భారతీయ ఆలోచనలు, పట్టుదల, నిర్వహణ సామర్థ్యం, భవిష్యత్‌ను అంచనా వేయగలగడం వంటి భిన్న అంశాల సమ్మిళితంగానే భారతీయులు అంతర్జాతీయ రంగంలో రాణిస్తున్నారని ‘మేడ్ ఇన్ ఇండియా’పుస్తక రచయితలు ఆర్ గోపాల కృష్ణన్, రంజన్ బెనర్జీలు చెబుతున్నారు. పేదరికం, ప్రతికూల సామాజిక పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు అన్ని దేశాల్లోనూ ఉన్నప్పటికీ భారత యువత భిన్నమైన సవాళ్ల మధ్యే పెరుగుతూ, రాణిస్తూ,రాటుదేలుతూ వస్తుందని, అందుకే ఎలాంటి మిశ్రమ సవాళ్లు ఎదురైనా ధీమాగా అధిగమించగలుగుతోందని రచయితలు చెబుతున్నారు. అలాగే..ఆంగ్ల భాషలో ప్రావీణ్యం, అత్యంత పోటీవాతావరణంలోనూ రాణించడం, ఆయా పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చుదిద్దుకోవడం, అన్నింటికీ మించి ఎంతటి శ్రమనైనా ఓర్చుకునే నైజాన్ని కలిగి ఉండటం అన్న నాలుగు లక్షణాలే మేడ్ ఇన్ ఇండియా మేనేజర్లును ఇబ్బడిముబ్బడిగా ప్రపంచ దేశాలకు అందిస్తున్నాయని రచయితలు విశే్లషించారు. అలాగే భారత ఐఐఎటిలు ఇస్తున్న శిక్షణ కూడా వీరిని అన్ని రకాలుగానూ తీర్చిదిద్దుతోందని, దరఖాస్తులు చేసుకున్న వేలాది మందిలో కేవలం 2 శాతం మందికే వీటిలో అడ్మిషన్లు లభించడం ఈ సంస్థలు ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్న శిక్షణే నిదర్శనమని చెబుతున్నారు. తన కుమారుడిగి ఐఐటిలో సీటు రాలేదని ఎన్‌ఆర్ నారాయణ మూర్తి చెప్పడమే ఐఐటీలు బోధనాపరమైన ప్రామాణికతకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని చెప్పవచ్చు. 1959లో తొలిసారిగా ఓ యూకే కంపెనీకి సీఇఓగా బాధ్యతలు చేపట్టే అవకాశం భారతీయుడైన జెఎమ్ లాల్‌కు దక్కింది. 1961లో యూనిలివర్ అనే సంస్థ ప్రకాశ్ టాండన్ అనే మరో భారతీయుడికి చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి మొదలైన మేడ్ ఇన్ ఇండియా మేనేజర్ల విజయ పరంపర అప్రతిహతంగానే సాగుతూ వస్తోంది.