జాతీయ వార్తలు

సచిన్ పైలట్ వర్సెస్ మెహతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
==========
రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి రేసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సచిన్ పైలట్ ముందంజలో ఉన్నారు. సచిన్ పైలట్‌ను టోంక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించడంతో, పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మెహతా ఎన్నికల బరిలో ఉన్నారు. టోంక్‌కు ఘన చరిత్ర ఉంది. ప్రసిద్ధ దేవ్ నారాయణ్ ఆలయం ఇక్కడ ఉంది. సచిన్ పైలట్ తన తండ్రి దివంగత రాజేష్ పైలట్‌తో కలిసి ఈ దేవాలయాన్ని తరచుగా చిన్న వయస్సులో సందర్శించేవారు. ఈ దేవాలయంలో కొలువైన విష్ణుమూర్తిని గుజ్జర్లు తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఈ దేవాలయాన్ని గత నెలలో సచిన్‌పైలట్ తన కుమారులు ఆరాన్, వెహాన్‌తో కలిసి సందర్శించారు. ఈ దేవాలయాన్ని దేవ్ ధామ్ జోధ్‌పూరియా అని కూడా పిలుస్తారు. 41 ఏళ్ల యువనేత సచిన్ పైలట్ రాష్ట్రంలో బీజేపీకి తన ప్రచారంతో చెమటలు పట్టిస్తున్నారు. టోంక్ నియోజకవర్గంలో 46 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చేది. బీజేపీ 1980 నుంచి మహవీర్ ప్రసాద్‌కు టికెట్ ఇస్తే, 2013లో అజిత్ సింగ్ మెహతాకు టికెట్ ఇచ్చింది. ఈసారి మళ్లీ బీజేపీ తరఫున మెహతా, కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్‌తో ఢీకొంటున్నారు. పైలట్ 2004లో దౌసా నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. 2009లో ఆజ్మీర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో మాత్రం పైలట్ ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సన్వార్ లాల్ జాట్ చేతిలో పరాజయం పాలయ్యారు. జాట్ మరణించడంతో గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఈ సీటు కాంగ్రెస్ వశమైంది. టోంక్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 40 నుంచి 50 వేల మంది ముస్లింలు ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ మాత్రం ఆరెస్సెస్‌లో పనిచేసిన వారికే సీటు కేటాయించేది. ఈ సీటు నుంచి 1985, 1990, 1998, 2003, 2008, 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జకీయా పోటీ చేసి 1985, 1995, 2008 ఎన్నికల్లో గెలిచారు. మిగతా ఎన్నికల్లో ఆరెస్సెస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఈ సీటులో సచిన్ పైలట్ పోటీచేయడం వల్ల ముస్లింల మద్దతు లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. ఇక్కడ ముస్లింలతో సచిన్ పైలట్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. సచిన్ పైలట్ జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమార్తెను వివాహమాడిన విషయం విదితమే. దీంతో ఫరూక్ అబ్దుల్లా కూడా అనేకసార్లు టోంక్ నియోజకవర్గం నవాబు డాక్టర్ అజ్మల్ సైదీ ఇంటికి వచ్చారు. కాగా తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంపై జకియా మాత్రం మండిపడుతున్నారు. 69 ఏళ్ల జకియా మాత్రం తన మద్దతు సచిన్ పైలట్‌కు ఉంటుందో లేదో చెప్పడం లేదు. ఇక్కడ గుజ్జర్లు 30 వేల మంది ఉన్నారు. ఇంకా ఎస్సీలు 35వేల మంది, 15 వేల మంది మాలలు ఉన్నారు. పైలట్ గుజ్జర్ల సామాజికవర్గానికి చెందినవారు. ఇక్కడ ముస్లింలు, గుజ్జర్లు, ఎస్సీలు సచిన్ పైలట్‌కు మద్దతు ఇస్తే పైలట్ గెలుపు సులభమవుతుంది. ముస్లింలు గెలవడమే కష్టం. అటువంటి సమయంలో గెలిచే జకియాకు టికెట్ ఇవ్వకపోవడంపై ముస్లింలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సచిన్ పైలట్ ఫరూక్ అబ్దుల్లా కుమార్తెను వివాహం చేసుకున్నా, ముస్లింలతో సంబంధాలు బాగా ఉన్నా, ముస్లిం అభ్యర్థికి సీటు ఇవ్వకపోవడంపై లోలోపల ఆగ్రహంతో ఉన్నారు. ‘నేను టోంక్ నియోజకవర్గం కావాలని అడగలేదు. పార్టీనే నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమంది. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తాం’ అని సచిన్ పైలట్ అన్నారు.
ఇక్కడ ముస్లింలలో సంపన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. వీరంతా సచిన్ పైలట్ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామంటున్నారు. కాగా బీజేపీ ఎమ్మెల్యే మెహతా మాత్రం పైలట్ అవుట్‌సైడర్ అంటున్నారు.