జాతీయ వార్తలు

శాంతికి ఊతం కర్తార్‌పూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, నవంబర్ 27: కర్తార్‌పూర్ కారిడార్ అనంతమైన ప్రయోజనాలు చేకూరుతాయని పంజాబ్ కేబినెట్ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ మంగళవారం నాడిక్కడ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భారత్-పాకిస్థాన్ దేశాల్లో శాంతి నెలకొల్పడమేకాకుండా, విరోధాలు సమసిపోవడానికి అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాహోర్‌కు 120 కిలోమీటర్ల దూరంలోని నారోవాల్‌లో కర్తార్‌పూర్ కారిడార్‌కు జరిగే శంకుస్థాపన (గౌండ్ బ్రేకింగ్) కార్యక్రమానికి సిద్ధూ పలువురు భారత జర్నలిస్టులతో కలిసి ఇక్కడికి వచ్చారు. మార్గమధ్యలో ఆయనకు వాఘా సరిహద్దుల్లో పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన అధికారులు సాదర స్వాగతం పలికారు. కాగా మొత్తం నాలుగు కిలోమీటర్ల దూరం ఉండే కర్తార్‌పూర్ కారిడార్ భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరాబాబా నానక్ ప్రాంతం నుంచి పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ నారోవాల్‌లోని గురుద్వారా వరకు ఉంటుంది. దీనిద్వారా భారత్‌లోని సిక్కు యాత్రికులు వీసా లేకుండా పాక్‌లోని గురుద్వారాకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. ఈ కారిడార్‌కు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బుధవావారం శంకుస్థాపన చేయనున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు దోహదపడే ఈ కారిడార్ కార్యరూపం దాల్చేందుకు సహకరించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సిద్ధూ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కారిడార్ ప్రారంభమైతే సిక్కుల 71 కల సాకారం అయినట్లేనన్నారు. తనపట్ల విమర్శలు చేసేవారిని పట్టించుకోనని, దైవ సంబంధ కార్యక్రమాలను రాజకీయాలతో ముడిపెట్టడం తగదని ఆయన తెలిపారు.