జాతీయ వార్తలు

మళ్లీ మాదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, నవంబర్ 27: మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీకి గత 15 సంవత్సరాలుగా అప్రతిహత గెలుపును ఇస్తూ వచ్చారని, ఈ ఎన్నికల్లో సైతం తమ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయన మంగళవారం పీటీఐతో తన భావాలను పంచుకున్నారు. 15 ఏళ్లపాటు సుదీర్ఘంగా పాలించిన బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న దానిపై ఆయన స్పందిస్తూ, అది వ్యతిరేకత కాదు అనుకూలత అని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లాంటి దిగ్గజాలు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్నారు. తమ పార్టీ రాష్ట్రంలో 2003 నుంచి అధికారంలో ఉందని, ఈసారి కూడా తమ విజయం సునాయసమని ఆయన అన్నారు. 2008, 2013 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో తమ సభలకు ప్రజల సంఖ్య బాగా పెరిగిందని, ముఖ్యంగా పేదలు తమ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు వ్యతిరేకంగా పనిచేస్తాయా అన్న ప్రశ్నకు ఆ రెండూ తమ విజయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని అన్నారు. అయినా ఆ రెండు నిర్ణయాలు దేశానికి దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూర్చేవని అన్నారు. మోదీ భారత్‌కు దేవుడిచ్చిన వరం అని కీర్తించిన ఆయన రాహుల్‌గాంధీ తీరుపై మండిపడ్డారు. రాహుల్ ఎన్నికల ప్రచారంలో తన స్థాయిని దిగజార్చుకుని మరీ ప్రవర్తించారని విమర్శించారు. మోదీ నిజాయితీని ఈ దేశంలోని ప్రజలెవరూ సందేహించడం లేదని, అతను అంకితభావం, నిజాయితీ గల వ్యక్తని, దేశానికి దేవుడిచ్చిన వరం అని పేర్కొన్నారు.