జాతీయ వార్తలు

‘షౌట్.. ఇండియా 112’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, డిసెంబర్ 1: ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సహాయాన్ని అందించే అత్యవసర యాప్‌ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారంనాడిక్కడ ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే ‘112 ఇండియా’ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన రెండో రాష్ట్రంగా హిమాచల్ తర్వాత ఆ ఘనతను నాగాలాండ్ దక్కించుకుంది. ఈ యాప్‌లో మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన ‘షౌట్’ అంశాన్ని ఇందులో చేర్చామని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా తెలిపారు. దీన్ని అత్యవసర స్పందన, సహాయ వ్యవస్థ (ఇఆర్‌ఎస్‌ఎస్)కు అనుసంధానం చేస్తామని, దీని వల్ల ఆపదలో ఉన్న మహిళలకు సమీపంలోని పోలీసు స్టేషన్ లేదా సహాయకుల నుంచి ఎలాంటి జాప్యం లేకుండా చేయూత లభిస్తుందన్నారు.
జీపిఎస్ వ్యవస్థ ద్వారా సదరు మహిళ ఎక్కడ ఉన్నదీ వెంటనే తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. దేశ అభివృద్ధి కార్యకలాపాల్లో మహిళలు క్రియాశీలకంగా పని చేయాలంటే వారికి తగిన రక్షణ, భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. దేశ జనాభాలో సగ భాగం కలిగిన మహిళలకు అన్ని చోట్లా సురక్షితమైన పరిస్థితుల్ని కల్పిస్తే అభివృద్ధిలో వారి భాగస్వామ్యానికి తిరుగుండదన్నారు. ఏ దేశంలో అయితే మహిళలకు పూర్తి రక్షణ లభిస్తుందో ఆ దేశ అభివృద్ధిని ఎవరూ నిరోధించలేరన్నారు. ఈ యాప్‌ను ఉపయోగించుకోవడం ద్వారా సదరు మహిళలకు పోలీసులు, వైద్యం, అగ్నిమాపక విభాగాల నుంచి తక్షణ సహాయం లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే మహిళల భద్రత కోసం హెల్ప్ లైన్లు సహా అనేక చర్యలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిందన్నారు. అలాగే ఐపిసి సహా అన్ని చట్టాలను సవరించి మహిళల రక్షణ, భద్రతకు మరింత బలాన్ని చేకూర్చామన్నారు. లైంగిక వేధింపు కేసుల సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని, అలాగే సైబర్ నేరాలను గుర్తించేందుకు జాతీయ స్థాయిలో డేటాబేస్‌ను సిద్ధం చేశామన్నారు.