జాతీయ వార్తలు

ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛగా నిర్వహిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దేశంలో ఎన్నికలను సజావుగా, స్వేచ్ఛగా, నిజాయితీగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీల్ ఆరోరా అన్నారు. ఆయన 23వ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా తాను పనిచేస్తానన్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ శనివారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సునీల్ ఆరోరా నియమితులయ్యారు. సునీల్ ఆరోగా 2021 అక్టోబర్ వరకు ఆ పదవిలో ఉంటారు. పార్లమెంటుతోపాటు కాశ్మీర్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికలు 2019లో జరగనున్నాయి. సునీల్ ఆరోరా మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు శాంతియుతంగా జరగాలన్నారు. సునీల్ ఆరోగా 2017 ఆగస్టు 31 తేదీన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అంతకు ముందు యన సమాచార శాఖ కార్యదర్శిగా, నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. 1980 బ్యాచికి చెందిన ఈ ఐఎఎస్ అధికారి రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన వారు. పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శిగా 1999-2002 మధ్య పనిచేశారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు సీఎండీగా ఐదేళ్లపాటు పనిచేశారు. 1993-98లో అప్పటి రాజస్థాన్ సీఎం వద్ద కార్యదర్శిగా పనిచేశారు. 2005-08లో సీఎం వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అదే రాష్ట్రంలో ధోల్‌పూర్, ఆళ్వార్, నాగౌర్, జోద్‌పూర్‌లో జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.