జాతీయ వార్తలు

చేతకాకపోతే సహాయపడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 2: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేసే శక్తి లేని పక్షంలో భారత్ సహకారం తీసుకోవాలని కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. గత నాలుగేళ్లలో ఎన్డీఏ హయాంలో దేశంలో ఉగ్రవాద సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో రాజీలేని పోరు చేస్తున్నామన్నారు. ఆఫ్గనిస్తాన్ ఉగ్రవాద సంస్థ తాలిబాన్లను అణచివేసేందుకు అమెరికా సాయం తీసుకుందన్నారు. అదే పాకిస్తాన్ తన సొంత గడ్డపై ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ సహకారం తీసుకోవాలన్నారు. ఆదివారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ జమ్ముకాశ్మీర్ ఒక అంశం కాదని, ఈ రాష్ట్రం భారత్‌లో భూభాగమన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉగ్రవాదం అనే అంశం మాత్రమే చర్చకు ఉందని, దీనిపై చర్చించేందుకు పాకిస్తాన్ ముందుకు రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వినాశకర రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఈ పార్టీకి దేశ ప్రయోజనాలు కాబట్టవన్నారు. ఎంతసేపు పదవీ వ్యామోహం తప్ప దేశ సమగ్రత గురించి ధ్యాస లేదన్నారు. గత నాలుగున్నరేళ్ల బీజేపీ పాలనలో ఉగ్రవాద సంఘటనలు జరగలేదని, ఇంతకంటే విజయమేమి కావాలన్నారు. జమ్ముకాశ్మీర్ రాష్ట్రాన్ని రాజకీయ ప్రక్రియలోకి తెచ్చామనన్నారు. దేశంలో జరిగే ప్రతి ఉగ్రవాద చర్య వెనక పాకిస్తాన్ ప్రోత్సాహం ఉందన్నారు. భారత్ సరిహద్దులు సురక్షితంగా, క్షేమంగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం తగ్గుముఖం పట్టాయన్నారు. రానున్న రోజుల్లో ఈ రెండు శక్తులను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తామ న్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక కార్యకలాపాలు 50 నుంచి 60 శాతం తగ్గాయన్నారు. దేశంలో 90 జిల్లాల్లో నక్సల్స్ కార్యకలాపాలు ఉండేవని, ఈ రోజు 8 నుంచి 9 జిల్లాలకు హింస పరిమితమైందన్నారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల్లో గెలిచేందుకు దేవాలయాలు చుట్టూ తిరుగుతున్నారని, గోవులను పూజిస్తున్నారన్నారు. కాగా ఈ రెండూ కూడా బీజేపీ సంస్కృతిలో భాగమన్నారు. కాంగ్రెస్ కుహనా రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.